మైకేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్ కన్నుమూత

Share Icons:

లాస్ వెగాస్, జూన్ 28,  మైకేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్ కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. గతకొంత కాలంగా పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. జోయ్ జాక్సన్ మరణించిన విషయాన్ని రాండీ జాక్సన్ జూనియర్, తాజ్ జాక్సన్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. “తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలి” అని రాండీ ట్వీట్ చేయగా, “కుటుంబమంతా ప్రేమించే తాతయ్య దూరమవ్వడం మనసుకు బాధ కలిగిస్తుంది” అని తాజ్ ట్వీట్ చేశారు. జాక్సన్ చిన్నకొడుకు ప్రిన్స్ మైకేల్ జాక్సన్ ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా జోయ్‌కి నివాళులు అర్పించాడు. ఆత్మస్థైర్యానికి, అంకితభావానికి జోయ్ నిదర్శనమని.. తమకు అత్యుత్తమ మార్గాన్ని చూపిన దార్శనికుడుని పోస్ట్ చేశాడు.

జోయ్ 1928 జూలై 26న అర్కాన్సాస్‌లోని ఫౌంటేయిన్ హిల్‌లో జన్మించారు. భార్య కేథరీన్. మొత్తం 11 మంది సంతానం. వీరిలో మైకేల్ జాక్సన్ ఎనిమిదో సంతానం. పిల్లల టాలెంట్‌ను గుర్తించి వాళ్లను మ్యూజిక్ వైపు మళ్లించారు. ‘ది జాక్సన్ బ్రదర్స్’ అనే పేరుతో బ్యాండ్ ఏర్పాటు చేసిన ఆయన దాన్ని పాపులర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికాలోనే మోస్ట్ టాలెంటెడ్ మేనేజర్‌గా నిలిచారు.

మామాట: కుమారుడి దారిలో ..

Leave a Reply