కంటెస్టంట్స్ సరదా టాస్కులు..హౌస్ నుంచి మహేష్ ఎలిమినేట్…

mahesh vitta eliminated in big boss house
Share Icons:

హైదరాబాద్: సన్ డే ఫన్ డే అంటూ కింగ్ నాగార్జున ఈ ఆదివారం ఎపిసోడ్లో ఇంటి సభ్యుల చేత సరదా టాస్కులు చేయించారు. మొదట 8 మంది సభ్యులని రెండు టీంలుగా విభజించి ఓ టాస్క్ ఇచ్చారు. శ్రీముఖి టీంలో రాహుల్, వితికా,అలీలు ఉండగా….మహేష్ టీంలో బాబా భాస్కర్, వరుణ్, శివజ్యోతిలు ఉన్నారు. ఒక్కో టీం నుంచి ఒక్కో కంటెస్టెంట్ వచ్చి చిట్టీ తీసి దానిపై ఏ సినిమా పేరు రాసుందో కెమెరాకు చూపించాలి. ఈ సినిమా పేరును బోర్డుపై బొమ్మల రూపంలో వేసి తన టీం సభ్యులతో చెప్పించాలి. ఈ టాస్క్‌లో శ్రీముఖి టీం విజయం సాధించింది.

ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్ అందరికీ బోర్డులు ఇచ్చారు. ఈ బోర్డులపై థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ బొమ్మలున్నాయి. అయితే నాగార్జున ఒక్కో ప్రశ్నను వారికి సంధించారు. ఈ ప్రశ్నకు యస్ అనేవారు థంబ్స్ అప్, నో అనేవారు థంబ్స్ డౌన్ చూపించాలి. ఏదైనా పెళ్లికి వెళ్లినప్పుడు ఎవరికైనా సైట్ కొట్టారా?, స్కూల్ డేస్‌లో ఎవరికైనా లవ్ లెటర్ ఇచ్చారా?, ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీతో అమ్మాయితో కానీ, అబ్బాయితో కానీ చాట్ చేశారా? వంటి ప్రశ్నలను నాగార్జున అడిగారు. ఈ ప్రశ్నలకు ఇంటి సభ్యులు ఫన్నే ఫన్నీ సమాధానాలు ఇచ్చారు.

ఈ సరదా టాస్క్ లు తర్వాత నాగార్జున ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. ఈ వారం నామినేషన్ లో రాహుల్, వరుణ్, మహేష్ లు ఉన్న విషయం తెలిసిందే. ఇక వీళ్లలో మొదట రాహుల్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఆ తరవాత ఫైనల్‌గా వరుణ్ సేఫ్ అని చెప్పి…మహేష్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. మహేష్ ఎలిమినేషన్‌ను ఎవరూ పెద్దగా ఫీలయినట్టు కనిపించలేదు. సరదాగా, నవ్వుతూ సాగనంపేశారు. ఇంటిలో నుంచి బయటికి వస్తూ బాబా భాస్కర్ కాళ్లకు మహేష్ నమస్కారం చేశాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ మీదికి వచ్చిన మహేష్‌కు నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్ల ఫొటోలను మహేష్‌కు నాగార్జున ఇచ్చారు. ఈ ఏడుగురిలో నంబర్ వన్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ల ఫొటోను బోర్డుపై అతికించాలని చెప్పారు. ఇక మిగిలిన ఫొటోలను మహేష్ ఇష్టాన్ని బట్టి రెండు, మూడు అంతకన్నా ఎక్కువ ముక్కలుగా చించొచ్చని చెప్పారు. దీంతో మహేష్ బాబా భాస్కర్ ఫొటోను బోర్డుపై అతికించి.. మిగిలిన ఫొటోలన్నీ చిన్నగా చించేసి రకరకాల కారణాలు చెప్పేశాడు. ఇక చివరికి మహేష్ వెళుతూ వెళుతూ బిగ్ బాంబ్‌ను శ్రీముఖి మీద విసిరాడు. ఈ బిగ్ బాంబ్ ప్రకార… ఈ వారమంతా కిచెన్‌లోని సామగ్రి అంతటినీ శ్రీముఖే క్లీన్ చేయాలి.

 

Leave a Reply