మేజర్ అజయ్ కృష్ణగా మహేశ్…సింబా పాత్రకి డబ్బింగ్ చెప్పిన నాని

mahesh new character revealed director anil ravipudi
Share Icons:

హైదరాబాద్:

 

ఇటీవలే మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న మహేశ్ బాబు…ప్రస్తుతం తన 26వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇక ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ బాబు కనిపించనున్నాడనే టాక్ చాలా రోజుల క్రితమే బయటికి వచ్చింది.

 

తాజాగా దీనికి సంబంధించి షూటింగ్ స్పాట్ నుంచి మహేశ్ బాబు లుక్ ఒకటి బయటికి వచ్చింది కూడా. ఈ సినిమాలో మహేశ్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడంటూ, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశాడు. కశ్మీర్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిందంటూ, షూటింగ్ మొదలైందనే విషయం చెప్పాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్న విషయాన్ని స్పష్టం చేశాడు.

 

ఇక హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’ ఈ నెల 19వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలకిగాను నాని .. జగపతిబాబు .. బ్రహ్మానందం .. అలీ .. రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. సింబా అనే సింహం పాత్రకి నాని డబ్బింగ్ చెప్పాడు.

 

ఆ విషయాన్ని గురించి నాని మాట్లాడుతూ, యానిమేషన్ కి సంబంధించిన పాత్రలకి డబ్బింగ్ చెప్పడమంటే నాకు చాలా ఇష్టం. ‘ఈగ’ సినిమాలో ఆ పాత్రకి రాజమౌళిగారు నాతో డబ్బింగ్ చెప్పిస్తారని అనుకున్నాను. కానీ ‘ఈగ’ పాత్రకి మాటలు ఉండవని ఆయన చెప్పడంతో చాలా నిరాశపడ్డాను. ఆ తరువాత ‘అ’ సినిమాలో చేపకి వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు ‘ది లయన్ కింగ్’ సినిమాలో సింహం పాత్రకి డబ్బింగ్ చెప్పడంతో నా ముచ్చట తీరిందని చెప్పుకొచ్చాడు.

Leave a Reply