Header Banner
Header Banner
TRENDING NOW

మహేశ్ మూవీ లో విజయశాంతి?

మహేశ్ మూవీ లో విజయశాంతి?

హైదరాబాద్, ఏప్రిల్ 19,

నిన్నటి తరం కథానాయికలుగా తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగినవారిని ముఖ్యమైన పాత్రల కోసం రంగంలోకి దింపడమనేది టాలీవుడ్లో ఇప్పుడు కొత్తదనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే నదియా .. ఖుష్బూ .. టబు .. భూమిక .. తెరపైకి వచ్చేశారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

ఇక రాజకీయాల్లో బిజీగా వున్న విజయశాంతిని కూడా రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానా .. సాయిపల్లవి కాంబినేషన్లో దర్శకుడు వేణు ఊడుగుల ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించారట.

ఇక మహేశ్ బాబుతో తాను చేయనున్న సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని అనిల్ రావిపూడి సంప్రదించినట్టుగా తెలుస్తోంది. పాత్ర ప్రాధాన్యత .. కాంబినేషన్ సీన్స్ గురించి వివరించడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

కొంతకాలంగా సినిమాలకి దూరంగా వున్న ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరించారనడంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి. లేడీ అమితాబ్ చేరికతో మహేష్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

మామాట: హిట్టు కొట్టాలి మరి ఎలాగోలా..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: