మహేశ్ మహర్షి@150 కోట్లు

Share Icons:

హైదరాబాద్, 18 మే:

సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా, తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

అయితే మహేశ్, నరేశ్ యాక్టింగ్ అదరగొట్టడం, రైతుల సమస్యలకి సంబంధించిన కథ కావడంతో, అందరికీ బాగా కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమా 4  రోజుల్లోనే 102.45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా 8 రోజుల్లో 150.45 కోట్లను రాబట్టిందనేది తాజా సమాచారం. ఈ ఏడాది వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా ఫుల్ రన్లో 127.20 కోట్లను వసూలు చేసింది. కేవలం 8 రోజుల్లోనే ఆ వసూళ్లను ‘మహర్షి’ అధిగమించి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా కొత్త రికార్డును నమోదు చేసింది.

మామాట: మొత్తానికి మహేశ్ మళ్ళీ హిట్ కొట్టాడు

Leave a Reply