దుమ్ములేపిన మహేశ్ సరిలేరు నీకెవ్వరు టీజర్…

mahesh-babu-sarileru-neekevvaru-teaser
Share Icons:

హైదరాబాద్:  సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం టీజర్ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అదిరిపోయింది.

అటు గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో సంక్రాంతికు విడుదలయ్యే సినిమాలపై చాలా ఆందోళన ఉంది. జనవరి 12న ఒకేరోజు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో బయ్యర్లు ఫుల్ టెన్షన్ పడిపోయారు. అసలు ఇద్దరు హీరోలు ఏ మాత్రం తగ్గకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోయారు. అయితే ఇప్పుడు ఇద్దరు సినిమాల నిర్మాతలు చర్చలు జరపడంతో విడుదల విషయంలో క్లారీటీ వచ్చింది. . మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల కానుందని, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో జనవరి 12న విడుదల కాబోతోందని ప్రకటించారు.

దీంతో బయ్యర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ పని పట్టిన మహేష్.. మరోసారి దాడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. అటు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మరోసారి మాయచేసి హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

 

Leave a Reply