దిల్ రాజుపై మహేశ్ ఫాన్స్ ఫైర్

Share Icons:

హైదరాబాద్, జనవరి 24:

సూపర్ స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తోన్న ‘మహర్షి’ సినిమా కోసం ప్రిన్స్ అభిమానులు ఎంతో ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇది మహేష్‌బాబుకు 25వ సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘మహర్షి’ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ హిట్ చేసి సిల్వర్ జూబ్లీ నిర్వహించాలని చూస్తున్నారు.

అయితే, ఇప్పుడు ‘మహర్షి’ విడుదల తేదీ విషయంలో సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహర్షి’ని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. అయితే ఈ తేదీని మారుస్తున్నట్లు తాజాగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేస్తున్నట్లు మీడియాతో చెప్పారు. ఈ నిర్ణయంపై ఇప్పుడు మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. విడుదల తేదీని మార్చడానికి వీల్లేదని, మొదట అనుకున్న తేదీకే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 26న హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ‘మహర్షి’ విడుదల తేదీని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

మామాట: మరి అభిమానుల డిమాండ్‌కి దిల్ రాజు ఒప్పుకుంటారా…

Leave a Reply