హిట్ కాంబినేషన్ రిపీట్: మహేశ్‌తో మళ్ళీ వంశీ పైడిపల్లి సినిమా

Share Icons:

హైదరాబాద్, 22 మే:

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మహర్షి. ఈ నెల 9 న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక తనకి హిట్ ఇచ్చిన దర్శకులను ఎంతమాత్రం వదులుకోడు మహేశ్. సాధ్యమైనంత త్వరలోనే ఆ దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతాడు.

‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ చేయడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకో వచ్చు. అలాగే ఇప్పుడు మహేశ్ బాబుకి ‘మహర్షి’ సినిమాతో వంశీ పైడిపల్లి భారీ విజయాన్ని అందించాడు.

దీంతో మరో మంచి కథను సిద్ధం చేయమని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. వంశీ పైడిపల్లి కథను సిద్ధం చేసేలోగా మహేశ్ బాబు వేరే సినిమాలు చేసేస్తాడన్న మాట.

మామాట: హిట్ కాంబినేషన్స్ ఎప్పుడు రిపీట్ అవుతాయిలే

Leave a Reply