బాక్సాఫీసు దుమ్ములేపిన మహర్షి….

Share Icons:

 

హైదరాబాద్, 10 మే:

సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన చిత్రం మహర్షి..నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా మహేష్‌బాబు 25వ సినిమా కావడంతో అభిమానులతో మొదటిరోజు థియేటర్లు ఫుల్ అయ్యాయి.

ఇక సినిమాలో మ‌హేశ్ బాబు చాలా బాగా న‌టించాడు. రిషి కుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. అల్లరి నరేష్ కూడా రవి పాత్రకు ప్రాణం పోశాడు. ఇన్నాళ్లూ కామెడీ సినిమాలనే ఎంచుకున్న న‌రేష్.. ఇప్పుడు మాత్రం ఎమోష‌న‌ల్ పాత్రలో చాలా బాగా న‌టించాడు. పూజాహెగ్డే అందాల ఆర‌బోత‌కు స‌రిపోయింది.
అయితే, గురువారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలి రోజు దాదాపు రూ.45 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమెర్ సంధు సినిమా రూ.45కోట్లు రాబట్టిందని తెలిపారు. ఒక్క గుంటూరులోనే రూ.4.4కోట్లు సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మామాట: మొత్తానికి మహేశ్ బాక్సాఫీస్ రికార్డులు వేటాడే పనిలో పడ్డాడు…

 

Leave a Reply