మహారాష్ట్రంలో లెక్కలు తేల్చుకున్న బీజేపీ-శివసేన: హర్యానాలో కమలానిదే ఆధిక్యమా?

Maharashtra polls 2019: BJP-Shiv Sena announce seat-share
Share Icons:

ముంబై: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఐదు నెలలు కావొస్తుంది. అయితే ఈలోపే మరో మహా సమరానికి తెరలేచింది. మహారాష్ట్ర, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్21 న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో ప్రధాన పార్టీలు పాగా వేసేందుకు స్కెచ్ లు వేస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో మరోసారి పొత్తుగా పోటీ చేసి బీజేపీ-శివసేనలు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే మొన్నటివరకు వీరి పొత్తు విషయంలో క్లారీటీ రాలేదు.

కానీ ఇప్పుడు వారి సీట్లు లెక్కలు తేలాయి.  మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధిక స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ-శివసేన భావించడంతో సీట్ల కేటాయింపుపై పీఠముడి నెలకొంది. చివరకు బీజేపీ 164 చోట్ల పోటీ చేసేందుకు శివసేన అంగీకరిచింది. శివసేనకు 124 సీట్లను బీజేపీ ఇవ్వడంతో సీట్ల కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. బీజేపీ 164, శివసేన 124 కలిపి 288 చోట్ల పోటీ చేయడంతో మరో ఎన్డీయే మిత్రపక్షాలు ఆర్పీఐ ఇతర పార్టీలకు స్థానాలు లేకుండా పోయాయి.

తొలుత బీజేపీ 144, శివసేన 126 పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. మిగిలిన 18 స్థానాలకు తమ భాగస్వామ్యపక్షాలకు కేటాయిస్తామని సంకేతాలు ఇచ్చారు. కానీ చివరికి ఆర్పీఐ ఇతర పక్షాలకు ఎన్డీఏ సీట్లు కేటాయించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో వారు ఒంటరిగా పోటీ చేసే అవకాశముంది.

హర్యానా మళ్ళీ కమల వికాసమేనా?

అటు 90 స్థానాలు గల హర్యానా రాష్ట్రంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాలు, 33.2 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. అయితే ఈ సారి ఏకంగా 75 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని చూస్తుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శిరోమణి అకాలీ దళ్‌తో కలిసి.. 10 లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు. దీంతో అదే జోష్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూపాలన్న పట్టుదలతో బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు.

ఇక గత ఎన్నికల్లో 18 స్థానాలు, 24.1 ఓట్ల శాతం సాధించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. కీలకమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సారథి అభయ్ సింగ్ చౌతాలాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టుంది. అలాగే హుడా సారథ్యంలోనే పోరాడిన కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో 17 స్థానాలు, 20.6 శాతం ఓట్లతో మూడోస్థానానికే పరిమితమైంది. మళ్లీ ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలు ఎదుర్కొననుంది. అయితే ప్రీ పోల్ సర్వేలో మాత్రం బీజేపీకే సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి ఈ సారి మహారాష్ట్ర, హర్యానాలు ఎవరి ఖాతాలో పడుతాయో?

Leave a Reply