రాణా ప్రతాప్

Share Icons:

రాణా ప్రతాప్

మహారణా ప్రతాప్ సింహ్ అసలి పేరు కుంవర్ ప్రతాప్ జి, ఆయన రాజస్థాన్ సూర్యవంశం లో కుంబల్ ఘడ్ లో 9 మే,1540 న జన్మించారు. తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి, తల్లి-రాణి జీవత్ కాంవర్ జి. సిసోడియ రాజపుత్రుల వంశం. వారి ధార్మికం-హిందూధర్మం. రాజధాని  ఉదయ్ పూర్ నుంచీ పాలన సాగించారు.

మహారాణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”. అబ్రహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ వచ్చేటప్పుడు తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగాడట. అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా, అక్కడి రాజు ఎంత విశ్వాసపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” చదవొచ్చు.

 మహారాణా ప్రతాప్ సింహ్ ఈటె 80 కిలోల బరు వుండేదట. చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి. డిల్లీ బాద్షాహ్ అయిన అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తలదించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్ కు రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారాణా ప్రతాప్ దాన్ని తుచ్ఛంగా తిరస్కరించాడు. హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించారు. మహారణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడి కూడా కట్టారు. ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.

మహారాణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గాలు వదులుకున్నప్పటి నుండి వేల సంఖ్యలో స్వగృహాలు వదలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు. హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది. మహారాణా ప్రతాప్   దగ్గర శ్రీ జైమల్ మేడతీయ యుద్దశిక్షణ  ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్రుల వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు. ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు ఉన్నారని ప్రతీక. మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్  ఆదివాసీలు వారి అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు. వాళ్ళు మహారాణాను  పుత్రుడిగా భావించేవారు. మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నంలో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు. రాణా గుర్రం చేతక్ మహారాణాను కూర్చో బెట్టుకుని 26 అడుగుల కందకాన్ని దుమికిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది. అది ఎక్కడైయతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది. అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు. చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంతా ఎత్తులో గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు. శ్రీ మహారాణా ప్రతాప్ బరువు 110 కిలోలు ఉండేవారు. పొడవు 7’5’’. ఇరువైపుల దారు ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తనతో ఉంచుకునే వాడు. మహారణా ప్రతాప్,అతని గుర్రం గురించి తెలుసుకున్నాం. అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్. ఆయన 1597 జనవరి 29 న స్వర్గారోహణం చేశారు.

మహారాణా ప్రతాప్ ఆత్మ నిండి ఉందా అనిపించే ఈ పట్టణాన్ని 1567లో ఆరావళి పర్వత పాద పంక్తులలో మహారాజ ఉదయ్ సింగ్ నిర్మించాడు. మేవార్ సామ్రాజ్యానికి ఇది రాజధాని. మూడు సుందరమైన సరస్సులతో, అద్భుతమైన పాలరాతి కళాసంపదతో నిండి ఉంటుంది ఉదయ్ పూర్. దక్షిణం వైపు పిచ్డా సరస్సు, మిగిలిన మూడు దిక్కులా ప్రహరీ సరిహద్దులుగా ఉంటుంది ఈ సుందర నగరం. ఈ నగరంలో అన్నింటికన్నా చెప్పుకోదగ్గది సిటీ ప్యాలెస్. పిచోలా సరస్సు ప్రక్కనే ఉండే ఈ ప్యాలెస్ మొత్తం రాజస్థాన్ లోనే అతి పెద్దది. దీని నిర్మాణాన్ని 1559 లో మహారాణా ఉదయ్ సింగ్   చేపట్టారు. దీన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. మరో ముఖ్యమైన ప్యాలెస్ “లేక్ ప్యాలెస్”. సరస్సు మధ్యలో నిర్మించబడిన ఈ అద్భుతమైన కట్టడాన్ని మహారాణా జగత్ సింగ్ వేసవి విడిదిగా నిర్మించుకున్నారు. దీని నిర్మాణం 1743 లో మొదలయి 1746 లో పూర్తయింది. సరస్సు మధ్యలో ఉండటం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఈ ప్యాలెస్ లోనే ఉదయపూర్ మహారాజు, మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కి ఆతిధ్యమిచ్చారు. ఉదయపూర్ లో అడుగడుగునా రాజపుట్ వీరుడు, అసామాన్య ధైర్యసాహసాలతో మేవార్ గడ్డపై పరదేశీయుల ఆధిపత్యాన్ని నిరసించి తరిమికొట్టిన దేశభక్తుడు మహారాణా ప్రతాప్ ఉనికి కనిపిస్తూనే ఉంటుంది.
ఉదయపూర్ 1159లో రెండవ ఉదయసింఘ్ చేత నిర్మింపబడి మేవార రాజ్యానికి ప్రథమ   ఆఖరి రాజధానిగా స్థిరపరిచారు. ఈ నగరం నాగ్డా నగరానికి ఆగ్నేయంగా బణా నదీతీరంలో నిర్మించబడింది. చరిత్రననుసరించి రెండవ ఉదయ సింఘ్ ఆరావళీ పర్వతపాద ప్రాంతంలో వేటాడే సమయంలో ఒక తపస్వి చెంతకు వెళ్ళాడు. ఆ తపస్వి రాజును ఆశీర్వదించి అక్కడ ఒక రాజభవనం నిర్మించమని సలహా ఇచ్చాడు. అలా నిర్మిస్తే అది సురక్షితంగా ఉంటుందని రాజుకు నమ్మకంగా చెప్పాడు. ఫలితంగా రెండవ ఉదయ సింఘ్ ఆ ప్రదేశంలో తన నివాస స్థలంగా భవన నిర్మాణం చేసాడు. 1568లో మొగల్ చక్రవర్తి అక్బర్ చిత్తోఢ్ కోటను స్వాధీనపరచుకున్నాడు. ఉదయ సంఘ్ తన రాజధానిని తన నివాసిత ప్రాంతానికి మార్చుకున్నాడు. అది ఉదయపూర్ నగరం అయింది.
మొగల్ సామ్రాజ్యం బలహీన పడిన సమయంలో మొగల్ సామ్రాజ్యాన్ని ప్రారంభం నుండి ఎదిరిస్తున్న సూర్యవంశ రాజులైన సిశోడియా రాణాస్ (మహారాణాస్) తమను స్వతంత్రులుగా ప్రకటించుకుని చిత్తోఢ్ తప్ప మిగిలిన మేవార్ సమ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఉదయపూర్ రాష్ట్ర రాజధానిగా మిగిలి పోయింది. 1818 నుండి బ్రిటిష్ పాలనా కాలంలో కూడా ఇది రాజసంస్థానంగా కొనసాగింది. ఎడారి పర్వత ప్రాంతం అయినందున ఇది అతి పెద్ద మొగల్ అశ్వసేనకు అనుకూలం కాదు కనుక ఉదయపూర్ మొగల్ చక్రవర్తుల ఆధిపత్యం నుండి సురక్షితంగా మిగిలి పోయింది. ప్రపంచంలో ఇప్పటికీ కొనసాగుతున్న పురాతనమైన ఒకే రాజవంశం మేవాడ రాజవంశం. నేపాల్ రాజవంశం, జమ్ము రాజవంశముకు కూడా మూలం మేవార్ రాజవంశమే.మధ్య భారతం లోని మేవాడ్ అనాదిగా వీర రాజపుత్రుల క్రీడా ప్రాంగణం. మేవాడ్ కు చెందిన శిశోడియా వంశీయుల లో బాప్పా రావాల్, రాణా హమీర్, రాణా సంగ వంటి ఎందరో మహావీరులు, దేశభక్తులూ వున్నా ”మహా రాణా” అని పిలువబడిన వాడు రాణా ప్రతాప్ సింగ్ ఒకడే!
1540 లో జన్మించిన రాణా ప్రతాప్ సింగ్ మేవాడ్ రాజు ఉదయ సింహునికి వున్న 23 మంది కుమారులలో పెద్ద వాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన పిరికివాడైన ఉదయ సింహుడు చితోడ్ గడ్ రాజుగా వున్నప్పుడు, స్వతంత్ర రాజ్యమైన చితోడ్గడ్ మీద 1568 లో అక్బర్ యుద్ధం ప్రకటించాడు. ఉదయ సింహుడు ఆరావళీ కొండల్లోకి పారిపోయి అక్కడ ఉదయపూర్ అనే నగరాన్ని నిర్మించుకున్నాడు. చితోడ్, మేవాడ్ అక్బర్ వశమైనాయి. ఆ తర్వాత 4 సంవత్సరాలకు మరణిస్తూ ఉదయ సింహుడు, సంప్రదాయానికి విరుద్ధంగా పెద్ద కుమారుడు, మహా వీరుడు, సద్గుణ సంపన్నుడు, ప్రజలకు, మంత్రులకూ ప్రియుడు ఐన రాణాప్రతాప్ సింగ్ ను కాదని, తన చిన్న రాణి కొడుకు, దుర్మార్గుడు, ఎందులోనూ రాణా ప్రతాప్ కు సరిపోలని ‘జగమల్లు’ ను తనకు వుత్తరాదికారిగా ప్రకటించాడు. మంత్రులు, ప్రజలు అంగీకరింపక, రాణా ప్రతాప్ ను బలవంతం చేస్తే, అతను రాజ్యాన్ని స్వీకరించాడు. కసితో జగ మల్లు, రాణాప్రతాప్ స్వంత తమ్ముడైన శక్తిసింహుడు అసూయతో రగిలిపోయి అక్బర్ పక్షాన చేరారు. తన మంత్రులను, సామంతులను, ప్రజలను సమావేశం చేసి, చితోడ్ ను తిరిగి స్వాధీనం చేసుకుని, మేవాడ్ పరువును నిలబెట్టేదాక, రాజపుత్రుల అభిమానాన్ని ప్రపంచానికి తిరిగి తెలియజేసే దాకా రాజ లాంఛనాలను స్వీకరించనని, ఆకులలో నే తింటాననీ, నేలపైనే పడుకుంటా ననీ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు రాణా ప్రతాప్ సింగ్.
జయపూర్ మహారాజు బీహార్ మల్ కుమారుడు, మహా వీరుడు ఐన మాన్ సింగ్ ను అక్బర్ రాణా ప్రతాప్ వద్దకు దూతగా పంపి తనను చక్రవర్తిగా అంగీకరించి, సామంతుడిగా ఉండమని, లేకుంటే యుద్ధానికి సిద్ధంకమ్మని రాయబారం పంపించాడు. రాయబారానికివచ్చిన మాన్ సింగ్ ను కలుసుకోడానికి, అతనితో కలిసి భోజనం చేయడానికి రాణా ప్రతాప్ తిరస్కరిస్తే కోపోద్రిక్తుడైన  మాన్ సింగ్ భోజనం చేయకుండా..కొన్ని మెతుకులు తన అంగ వస్త్రం లో మూట గట్టుకుని వెళ్ళాడు అన్నపూర్ణను తిరస్కరించకూడదు అని! యుద్ధానికి సిద్ధంగావుండి తనను కలుసుకొమ్మని రాణా ప్రతాప్ తో చెప్పి గుర్రం ఎక్కాడు..” నీ స్వంత సైన్యంతో వస్తే రాజ లాంచనాలతో స్వాగతం పలుకుతా..అక్బర్ సైన్యంతో వస్తే నా కత్తితో స్వాగతం పలుకుతా అని జవాబిచ్చాడు రాణా ప్రతాప్!
రెండు లక్షల సైనికులనిచ్చి, మాన్ సింగ్ నాయకత్వం లో, తన పంచన చేరిన రాణాప్రతాప్ తమ్ముడు శక్తి సింగ్ ను, తన కుమారుడు సలీం ను తోడు గా పంపాడు అక్బర్ రాణా ప్రతాప్ మీదికి. అక్బర్ కి భయపడి, అతని కానుకలకు ప్రలోభ పడి అతనితో చేతులు కలిపిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళను తీసుకుని, తన రాజధానిని కొండల ప్రాంతమైన ‘కుంభల్ గడ్’ కి మార్చి, ఇరవై రెండు వేల మంది సైనికులతో హల్దీ ఘాట్ కి చేరుకొని అక్బర్ సైన్యానికి స్వాగతం పలికాడు రాణా ప్రతాప్.
-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply