ఇంకా ఓ కొలిక్కిరాని మహాకూటమి సీట్ల పంపకం…

mahakutami seats sharing not yet confirmed
Share Icons:

హైదరాబాద్, 13 అక్టోబర్:

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌ని ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజీఎస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ కూటమి సీట్ల పంపకం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనపడటం లేదు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ జాప్యం చేస్తుండడం పట్ల భాగస్వామ్య పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్‌తో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ సమావేశమయ్యారు.

సీట్ల పంపకంపై కాంగ్రెసు ఎటూ తేల్చడం లేదని కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు రోజుల్లో తేలుస్తామని కాంగ్రెసు అంటోంది. నిజానికి, కాంగ్రెసు 90 సీట్లకు పోటీ చేయాలని అనుకుంటోంది. మిగిలిన 29 సీట్లను బాగస్వామ్య పక్షాలకు పంచాలనేది ఆ పార్టీ ఆలోచన.

కానీ, భాగస్వామ్య పక్షాలు ఎక్కువ సీట్లు అడుగుతుండడంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది. రెండు, మూడు రోజుల్లో సీట్ల పంపకంపై స్పష్టత వస్తుందని కోదండరామ్ చెప్పారు. సీట్లు పంపిణీ త్వరగా జరపాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే అని చెప్పుకొచ్చారు. దసరా నుంచి ప్రచారంలోకి దిగుతామని అన్నారు.

మామాట: మరి కాంగ్రెస్ సీట్ల పంపకం ఎలా చేస్తుందో చూడాలి….

Leave a Reply