మధ్యప్రదేశ్ రాజకీయం: ఎమ్మెల్యేలు తిరిగొస్తేనే బలనిరూపణ…

Share Icons:

భోపాల్: మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడింది. బీజేపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, రెబెల్ ఎమ్మెల్యేలంతా తమవెంటే ఉన్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీ బలవంతంగా బెంగళూరులో బంధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున లాయర్ జోక్యం చేసుకుంటూ.. 16 మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సుప్రీంకోర్టు ముందు ప్రదర్శన నిర్వహిస్తామని కోరగా.. దీనికి ధర్మాసనం నిరాకరించింది.

మధ్యప్రదేశ్ కమల్ నాథ్ ప్రభుత్వంలోని 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, దీంతో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరులో బీజేపీ బంధించిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ తన పిటిషన్లో పేర్కంది.

కాగా, రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి ఆమోద ముద్ర వేశారు. బలనిరూపణ నిర్వహించాలంటే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరిగి రావాలని, అప్పుడే బలనిరూపణ పరీక్షకు అంగీకరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైనా కాకపోయినా.. నిర్బంధించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.

 

Leave a Reply