శ్రీదేవి బయోపిక్ లో మాధురి?

Share Icons:

ముంబై,ఫిబ్రవరి 27,

అందాల నటి శ్రీదేవి చనిపోయి అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆమె బయోపిక్ ను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. శ్రీదేవి పాత్రలో ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్టుగా ప్రచారం జరుగింది. అదీ కాక ఎప్పటికైనా తన బయోపిక్ తీస్తే అందులో తన కూతురు జాన్వీ కపూర్ నటించాలని శ్రీదేవి ఆశపడేదటి.

కాగా, శ్రీదేవి పాత్రను పోషించడం అంత సాధారణమైన విషయమేం కాదు. అద్భుతమైన హావభావాలు .. డైలాగ్ డెలివరీ .. డాన్సులు .. ఇలా అన్నింటిలోను ప్రేక్షకులను మెప్పించగల సామర్థ్యం కావాలి. అంతటి అనుభవం లేని కారణంగా బోనీకపూర్ మాత్రం ఇపుడు జాన్వీ గురించి ఆలోచించడం లేదట. శ్రీదేవి పాత్రను మాధురీ దీక్షిత్ అయితే అద్భుతంగా చేయగలదనే నిర్ణయానికి వచ్చిన బోనీకపూర్, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

బోనీకపూర్ .. అనిల్ కపూర్ లతో గల స్నేహం కారణంగా ఆమె అంగీకరించే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే శ్రీదేవి బయో హిట్టే..

మామాట: బెస్టాఫ్ లక్ మాధురీ… శ్రీదేవి కదా…

Leave a Reply