మా తెలుగు తల్లికి మల్లె పూదండ

Share Icons:

మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన  ఒక గేయం. గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా ఈ పాటను పాడారు.

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి!
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి!
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక!
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక!
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

ఇటువంటి గొప్ప మానిసి ఎక్కడా ఎప్పుడూ రాజీపడలేదు. రాజులా బతికారు.
శంకరంబాడి సుందరాచారి కి అమితమైన ఆత్మవిశ్వాసం. ఎక్కడా రాజీపడాలేదు. రాజీనామాలకు వెరవలేదు.

మదనపల్లెలో ఇంటర్మీడియేటు వరకు చదివారు . చిన్నతనం నుండే  స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు  . బ్రాహ్మణోచితములైన సంధ్యావందనం వంటి పనులు చేసేవారు   కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపేశారు  . తండ్రి మందలిస్తే కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయారు  . భుక్తి కోసం ఎన్నో పనులు చేసారు  .
తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసారు  . రైల్వే స్టేషనులో కూలీగా కూడా…  ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు చేరుకుని,  ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగారు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా.. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగారు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగారు. నివ్వెర పోయిన పంతులు గారితో, నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నారు. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు సుందరాచారి.
తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేసారు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చారు. ఆ సంచాలకుడు సుందరాచారిని బంట్రోతుగాను, బంట్రోతును సుందరాచారిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసారు.

రాజీ పడని వాళ్ళు ఎప్పుడూ రాజీనామాకు వెరవరు
“ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు పత్రికల్లో అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు.”
శంకరంబాడికి అమితమైన ఆత్మవిశ్వాసం. _/\_

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply