మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ని కలిసిన ‘మా’ టీమ్

Share Icons:

హైదరాబాద్, 5 ఫిబ్రవరి:

త్వరలో `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్న సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సినిమటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ని ‘మా’ సభ్యులు ఆహ్వానించారు.

అలాగే అమెరికా డల్లాస్‌లో మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్వహించే మెగా ఈవెంట్‌లో కూడా పాల్గొనాలని ఆయనకి ఆహ్వాన పత్రిక అందజేశారు.

మా`అధ్యక్షుడు శివాజీరాజా మరికొంతమంది సభ్యులతో కలిసి సోమవారం మంత్రి నివాసానికి వెళ్ళి ఆహ్వానించారు.

ఆహ్వానించిన వారిలో  ఎగ్జిక్యూటివ్  వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ  ఏడిద శ్రీరామ్, హీరో సురేష్, నటులు ఉత్తేజ్, సంతోషం సురేష్ కొండేటి తదితరులు ఉన్నారు.

మామాట: మరి ఆహ్వానం ఆంధ్రాకి ఉంటుందా..?

English summary:

‘MAA’ (Movie Artist Association) members invited the Telangana State Cinematography Minister Srinivas yadav to celebrate the ‘MAA’ Silver jubilee celebrations. And they also invited to participate in a mega event organized by Dallas.

Leave a Reply