‘మా’ లో గొడవలు.. ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా! 

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 19,

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో గొడవలు తీవ్రతరమవుతున్నాయి. అసోసియేషన్ ఎన్నికలు జరిగి… సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే గొడవలు మరింత ముదిరాయి. అసోసియేషన్ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో, అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేశారు.

రాజీనామాకు గల కారణాన్ని ఆయన వెల్లడించకపోయినా… అసోసియేషన్ లో నిధుల దుర్వినియోగమే రాజీనామాకు కారణమని ఫిలింనగర్ టాక్. మరోవైపు, అసోసియేషన్ లో వివాదాలు సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

మామాట: మాట వినని వారే మా లో ఉన్నారా ఏవిషీ…

Leave a Reply