“మా” లో ముసలం. కొత్తగా ఎన్నికైన పలువురు సభ్యులు గుడ్ బై !

Share Icons:
  • ఎన్నికల తీరుపై నిరసన …
  • పోస్టల్ బ్యాలట్ లెక్కలపై అనుమానం
  • ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా
  • మీడియా సమావేశం లో వెల్లడించిన సభ్యులు
  • ఓటర్ల తరఫున ప్రశ్నిస్తామన్న ప్రకాష్ రాజ్, శ్రీకాంత్

“మా ” లో. నిన్న జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన ఎక్సక్యూటివ్ సభ్యులతోపాటు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు ప్యానళ్ల నుంచి గెలిచినందున గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల వేళ రౌడీయిజం జరిగిందని, తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయని అన్నారు. ఇప్పుడు అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులు ‘మా’ కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన తాము కార్యవర్గ సమావేశాలలో రచ్చ చేయదలుచుకోలేదని శ్రీకాంత్ ,బెనర్జీ , ప్రభాకర్ , తనిష్ , తదితరులు తెలిపారు. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు బాగా చేయగలదని నమ్మకం ఉందని  పేర్కొన్నారు.. ఓట్ల లెక్కింపులో  జరిగిన అవకతవకలను పలువురు సభ్యులు ఎత్తిచూపారు.  పోస్టల్ బ్యాలట్ ఓట్లను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకోని పోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

రాజీనామా ఉపసహంహరించుకుంటా …       బట్ వన్ కండిషన్ : ప్రకాష్ రాజ్

“మా” ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా ఉపసంహరించు కుంటానని  ఒక కండిషన్ అని ప్రకాష్ రాజ్ అన్నారు. , “మా ” భాషకు ,ప్రాంతానికి , మతానికి సంబంధం లేకుండా ఎవరైనా పోటీ చేయవచ్చుననే నిబంధన ఉండాలని అందుకు “మా ” అధ్యక్షుడు విష్ణు అంగీకరిస్తే తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని ప్రకాష్ రాజ్ అన్నారు .

 నరేశ్ హవానే నడుస్తుంది మేం ఉండలేం: శ్రీకాంత్

మోహన్ బాబు అరగంట బూతులు తిట్టారు: బెనర్జీ

“పోలింగ్ రోజున బూత్ వద్ద తనీశ్ ను మోహన్ బాబు తిట్టడం చూశాను. అక్కడే విష్ణు కూడా ఉండడంతో నేను ఆయన వద్దకు వెళ్లి… గొడవలు వద్దని చెప్పాను. దాంతో మోహన్ బాబు కోపంతో ఊగి, అరగంటసేపు తిట్టారు. కొట్టబోయారు. తర్వాత మోహన్ బాబు అర్ధాంగి నిర్మల ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. ఆ ఘటనను మర్చిపోలేకపోతున్నాను.. అందుకే మా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. అని వివరించారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply