Header Banner
Header Banner
TRENDING NOW

18 జీవోలను రద్దు చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం!

18 జీవోలను రద్దు చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం!

అమరావతి,ఏప్రిల్ 19,

ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ పూర్తయిన తరువాత ఏపీ సర్కారు జారీ చేసిన 18 జీవోలను రద్దు చేయాలని ఈసీ సిఫార్సు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వాటిని రద్దు చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులకు ఈసీ నుంచి సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు అందాయి.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత,  ప్రకృతి విపత్తులు,  పెను ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే సీఎం సమీక్షలను నిర్వహించుకోవచ్చు. అది కూడా ఈసీ అనుమతి తీసుకునే జరపాలి. అయితే, 11న పోలింగ్ ముగిసిన తరువాత, సీఎం తొలుత పోలవరంపై, ఆపై సీఆర్డీయేపై సమీక్షలు జరిపిన సంగతి తెలిసిందే.

ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో తాను జరపాలని తలపెట్టిన హోమ్ శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ సమావేశాలకు అధికారులు వెళ్లకూడదు. అయినా, కొందరు వెళ్లడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఇక రద్దు చేసిన జీవోల్లో అత్యధికం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులవేనని తెలుస్తోంది.

మామాట: వారు కూడా ఎన్నికల సీఎస్ యే కదా.. కాదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: