రేపు లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో సాంగ్ విడుద‌ల‌

రేపు లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో సాంగ్ విడుద‌ల‌
Views:
21

రేపు లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో సాంగ్ విడుద‌ల‌

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 13ః

ప్రేమికుల దినోత్స‌వ నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానుల కోసం గిఫ్ట్ ఇవ్వనున్నాడు.

ఆయ‌న‌ నటిస్తున్న నా పేరు సూర్య చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సోను ప్రేమికుల దినోత్సవ కానుకగా రేపు ఉద‌యం 8.30 నిమిషాల‌కి విడుద‌ల చేస్తున్నారు.

ఈ మధ్యే విడుద‌ల‌ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్… ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు.

ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్య మందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు.

శేఖర్ ఈ పాటను పాడారు.

మొదటి పాటగా రిలీజ్ చేసిన సైనిక పాట ఎంతటి సంచ‌ల‌నం సృష్టించిందో…. రెండో పాటగా రిలీజ్ కానున్న లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో అనే పాట కూడా అంతే ఆదరణ పొందుతుందన‌డంలో సందేహం లేదు.

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈచిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా గ్రాండియర్ గా “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

ఈ సారి ప్రేమికుల దినోత్సవం అన‌గా రేపు అల్లు అర్జున్ అభిమానులకు ప్రత్యేకంగా ఉండనుంది.

రామ‌జోగ్య రాసినీ ఈ పాట హైలైట్‌

ఈ చిత్రంలోని లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికులకు కానుకగా రేపు ఉద‌యం 8.30 నిమిషాల‌కి అందించబోతున్నాం.

రామజోగయ్య శాస్త్రి తన అనుభవాన్ని రంగరించి ఈ అందమైన పాటను రచించారు.

విశాల్ శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గాత్రంతో ఈ పాట మరింత అందంగా తయారైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులుః స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులుః ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి),ఫైట్స్ – రామ్ లక్ష్మణ్,సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి,ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్,సినిమాటోగ్రఫి – రాజీవ్ రవి,

సంగీతం – విశాల్ – శేఖర్, సమర్పణ – k.నాగబాబు, సహ నిర్మాత – బన్నీ వాసు, నిర్మాత – శిరీషా శ్రీధర్ లగడపాటి, రచన, దర్శకత్వం – వక్కంతం వంశీ.

English Summery: On the eve of Valentines day Lover also fighter also of the movie Naaperu Surya naa illu India is being released. Allu Arjun is the hero of the film.

(Visited 11 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: