హిమజతో రాహుల్ రొమాన్స్…బోరుమని ఏడ్చిన జ్యోతి….

love task in big boss house...rahul-himaja love episode
Share Icons:

హైదరాబాద్: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 59 ఎపిసోడ్‌లను పూర్తి చేసి బుధవారం 60వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం మొదలైన కాలేజ్ టాస్క్.బుధవారం కూడా కొనసాగింది. లవ్ టీచర్ గా బాబా భాస్కర్, గాసిప్స్ టీచర్ గా వితికా, చిల్ గా ఉండే టీచర్ గా వరుణ్ ఆకట్టుకున్నారు. మిగతా ఇంటి సభ్యులు స్టూడెంట్స్ గా అలరించారు. అయితే బాబా క్లాస్ చెప్పడంలో భాగంగా శివజ్యోతి తన ఆట తను ఆడకుండా.. ఎమోషనల్‌గా ఎదుటి వ్యక్తులపై డిపెండ్ అవుతున్నారని బాబా బాస్కర్ అనడంతో ఏడుపు మొదలుపెట్టేసింది.

దీంతో రాహుల్ ఆ ఉద్దేశంతో అనలేదని ఓదార్చిన ఆగలేదు. ఇక బాబా భాస్కర్ వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సరే వినలేదు. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ…హౌస్‌లో ఒక్కొక్కరూ పోతూనే ఉంటారు.. వాళ్ల గురించి ఏడుస్తూ బాధపడుతూ మనల్ని మనం వీక్ చేసుకోకూడదు. స్ట్రాంగ్‌గా ఉండాలనే నేను చెప్పాను తప్ప. మరో ఉద్దేశం తనకు లేదన్నారు. దీనికి జ్యోతి రియాక్ట్ అవుతూ.. నేను మిమ్మల్ని నమ్మాను.. మీరు నాతో చెప్పి ఉంటే ఈ విషయం నేను ఇంతగా బాధపడేదాన్ని కాదు. అందరి ముందు ఇలా అనడమే నన్ను బాధ పెట్టింది అంటూ తనదైన శైలిలో గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. బాబా భాస్కర్.. ఆమె ఏడుపు చూసి తప్పైపోయింది.. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల నీకు తప్పుగా అర్ధం అయ్యింది అంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. చివరి జ్యోతి ఏడుపును కంట్రోల్ చేయడానికి తల ప్రాణం తోకకు వచ్చింది బాబా భాస్కర్‌కి.

దీని తర్వాత కాలేజ్ టాస్క్ లో భాగంగా రెండో లెవెల్ లో బాబా భాస్కర్, వితికాలు జడ్జిలుగా మిగతా ఇంటిలోని మగ సభ్యులు…మిగిలి ఉన్న ఆడ సభ్యులని సెలక్ట్ చేసుకుని లవ్ ప్రపోజ్ చేయాలని సూచించారు. దీంతో మహేశ్ ఒక్కడే శివజ్యోతి, పునర్నవిలకు కామెడీగా ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత రవి శ్రీముఖికు ప్రపోజ్ చేశాడు. అలాగే రాహుల్…హిమజకు ప్రపోజ్ చేశాడు.

అయితే వీరిలో హిమ‌జ‌, రాహుల్ జంట ప‌ర్‌ఫార్మెన్స్ జ‌డ్జెస్‌గా ఉన్న బాబా భాస్క‌ర్‌, వితికాల‌కి న‌చ్చ‌డంతో వారిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు. విజేత‌లుగా నిలిచిన రాహుల్‌, హిమ‌జ‌లు మ‌నోహ‌ర‌.. అనే పాట‌కి డ్యాన్స్ చేయ‌గా వారి ప‌ర్‌ఫార్మెన్స్‌ని ఇంటి స‌భ్యులు తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వారిద్ద‌రు హ‌గ్‌లు చేసుకోవ‌డం, హిమ‌జ ఉరుక్కుంటూ వ‌చ్చి రాహుల్‌పైకి ఎక్క‌డం వంటివి చూస్తూ పున‌ర్న‌వి తెగ న‌వ్వుతూ ఎంజాయ్ చేసింది. బాబా భాస్క‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సాగిన ప‌ర్‌ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్‌లో ఆకట్టుకుంది.

 

Leave a Reply