స్త్రీత్వం ఉనికి కోల్పోతోంది -మాతృత్వం విలువ కోల్పోతోంది

Share Icons:

” నాకు జీవితం ప్రసాదించిన స్త్రీత్వానికి
నేను రుణపడి ఉన్నా

“ఓ ఏడుపు నుంచి పుట్టిన
నేను .. ఆమెకు రుణపడి ఉన్నా

“నాకు  అక్షరాలిచ్చిన ఆమెకు రుణపడి ఉన్నా

“స్త్రీత్వం
నా కళ్ళు తెరిపించింది

“స్త్రీత్వమే
నా మాతృత్వం

“స్త్రీత్వమే
నా సహోదరత్వం

“స్త్రీత్వమే
నా సఖి

“స్త్రీత్వమే
నా ప్రేయసి

“స్త్రీత్వ బంధం
నాకు దొరకకపోయుంటే
నేనెవరికీ
కనిపించక
ఓ మారుమూల ఉండిపోయే వాడిని

” స్త్రీత్వానికి
పాదాభివందనం    – లెబనాన్ కవి ఖలీల్ జిబ్రాన్ రాసుకున్న కవిత తెలుగు అనువాదం
————

అని మనం మాతృత్వానికి అభివందనం చేసి స్త్రీని ప్రేమించి , లాలించి, గౌరవించాల్సిన తరుణంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనసు మేలిపెట్టినంతగా బాధగా ఉంటుంది.

******

1. కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ సమీపంలోని కాట్రాడితట్టు ప్రాంతంలో కన్నన్ (39), దివ్య (29) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. దివ్య మళ్లీ గర్బవతి అయ్యింది. మే 22వ తేదీన ప్రైవేటు ఆసుపత్రిలో దివ్య ఇద్దరు ఆడపిల్లలు (కవలలు)కు జన్మనిచ్చింది.
పట్టించుకోని భర్త, ఆగ్రహాం !
దివ్య మళ్లీ ఇద్దరు ఆడిపిల్లలకు జన్మనిచ్చిందని తెలుసుకున్న భర్త కన్నన్ అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. అత్తింటివారు ఆగ్రహించారని తెలుసుకున్న దివ్య కుమిలిపోయింది. వేరే దారిలేక పిల్లలను వెంట పెట్టుకుని పుట్టింటికి వెళ్లింది.
అత్తింటి వారు రాలేదని విరక్తి !
తనను తన బిడ్డలను చూడటానికి భర్త కన్నన్ తో పాటు అత్తింటివారు రాలేదని దివ్య తన గోడును చుట్టుపక్కల వారికి చెప్పింది. జూన్ రెండవ తేదీన ఇద్దరు ఆడపిల్లలు ఆకస్మికంగా మృతి చెందారు. తల్లి పాలు తాగుతున్న సమయంలో కవలలు ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారని చుట్టు పక్కల వారిని నమ్మించారు.
పిల్లలను పాతి పెట్టిన కన్నన్ !
కన్నన్ గుట్టు చప్పుడు కాకుండా పిల్లల మృతదేహాలను తీసుకెళ్లి తన సొంత ఊరు కాట్రాడితట్టులో పాతిపెట్టాడు. చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కుముదకు ఫిర్యాదు చేశారు. కుముద ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
నేరం అంగీకరించిన తల్లి
అత్తింటి వారు అలగడంతో తన ఇద్దరు బిడ్డలను గట్టిగా హత్తుకోవడంతో ఊపిరాడక మరణించారని తల్లి దివ్య నేరం అంగీకరించింది. కవలల మృతదేహాలను బయటకు తీసి వైద్య పరీక్షలు చేశారు. దివ్య, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని నాగర్ కోవిల్ పోలీసులు తెలిపారు. (వార్త సౌజన్యం వన్  ఇండియా తెలుగు )

ఒకచోట ఇలా తల్లే పుట్టిన పసికందుల ప్రాణాలని తృణప్రాయంగా తీసేసింది. మరొకరు ఎదిగిన కూతురిని నిలువునా చీరేసింది.

2.కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణం సమీపంలో జరిగింది. కోలారు తాలుకాలోని చిన్నాపుర గ్రామంలో నివాసం ఉంటున్న రాజేశ్వరి (18) అనే యువతి హత్యకు గురైయ్యింది.
రాజేశ్వరి సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారని సమాచారం. గ్రామం సమీపంలోని ఓ చెట్టుకింద రాజేశ్వరి, ఆమె ప్రియుడు కుర్చుని మాట్లాడుకుంటున్నారు.
చిన్నాపుర గ్రామస్తులు విషయం గుర్తించి రాజేశ్వరి తల్లి వెంకటమ్మకు విషయం చెప్పారు. ఇంటికి వచ్చిన కుమార్తె రాజేశ్వరిని ఆమె తల్లి వెంకటమ్మ ప్రశ్నించింది. ఎవరితో తిరుగుతున్నావు అంటూ కుమార్తెతో గొడవ పెట్టుకుంది. తరువాత సహనం కొల్పోయిన వెంకటమ్మ సమీపంలోని పెద్ద కర్ర తీసుకునింది.
కుమార్తె రాజేశ్వరి తల మీద బలంగా దాడి చెయ్యడంతో తల చీలిపోయింది. తల ముక్కలు కావడంతో రాజేశ్వరి సంఘటనా స్థలంలోనే మరణించింది. ఇళ్లు మొత్తం రక్తం మరకలు అయ్యాయి. కుమార్తె రాజేశ్వరిని హత్య చేసిన వెంకటమ్మ ఎలాంటి బాధలేకుండా ఇంటిలోనే ఓ మూల కుర్చుంది.  (వార్త సౌజన్యం వన్  ఇండియా తెలుగు )

********

కడుపున కన్న పిల్లలినే ఇలా విచక్షణా జ్ఞానం కోల్పోయి ప్రాణాలు తీస్తున్న తరుణంలో  ఇక స్త్రీత్వానికి విలువేముంది?  తన ఉనికి కోల్పోతోంది , మాతృత్వం అర్థం మారిపోతోంది. ఒకరికి భర్త ఆదరణ లేదని మరొకరికి ఊరు వెలి వేస్తుందని, భయాలతో మనుషుల ప్రాణాలని కూరగాయలు కోసినంత సులువుగా నరికేస్తున్నారు. తరుణికి గిరి భారమా , కనిపెంచే తల్లికి పిల్ల భారమా అని ఆనాడు అనేవారు ఈనాడు భారమే అని అమ్మతనాన్ని అడ్డంగా నరికేసున్తున్నారు , రాను రాను జరుగుతున్నా ఘోరాల వల్ల , పరిణితి లేని స్త్రీల ఫ్యాషన్ మాటల వల్ల “లేచిపోదాం వస్తావా” “వ్యభిచారం చేస్తా ” అని సిగ్గు విడిచి చెప్పేలా సినిమాలు తీసేసి ఆడవారు పరిణితి చెందారు అనో ఉమెన్ పవర్ అంటూనో పైసలు దండుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

మాతృత్వం స్త్రీ కి పరిపూర్ణతని ఇస్తుందంటారు. అదే స్త్రీత్వం. ఆ పరిపూర్ణతే స్త్రీత్వం కాని ఇప్పుడా స్త్రీత్వం ఉనికి కోల్పోతోంది. స్త్రీ త్వం వ్యాపారానికి, డబ్బులు సంపాదించడానికే  అన్నట్లుగా  అర్థం మార్చేసుకున్తున్నారు. అవును నిజమే అన్నట్లుగా పైన చెప్పిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి..

తరం మారుతున్నది

మన స్వరం మారుతోంది

మాతృత్వం విలువ కోల్పోతోంది

స్త్రీత్వం ఉనికి కోల్పోతోంది.

-రమణి

Leave a Reply