కమ్ముకుంటున్న అనుమాన మేఘాలు

Share Icons:

కమ్ముకుంటున్న అనుమాన మేఘాలు

పార్ల‌మెంటు వాయిదా… పార్ల‌మెంటు వాయిదా… పార్ల‌మెంటు వాయిదా… వాయిదా వేయ‌డానికి లోక్ స‌భ స్పీక‌ర్‌కు, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు
స‌భ‌లో గొడ‌వ చేయ‌డానికి అన్నా డిఎంకె స‌భ్యుల‌కు విసుగుపుట్ట‌డం లేదేమో కానీ చూసే దేశ ప్ర‌జ‌ల‌కు మాత్రం క‌చ్చితంగా విసుగు, చిరాకూ రెండు
వ‌స్తున్నాయి. ప్ర‌జాస్వామ్యంలో భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అనేది అత్యంత కీల‌క‌మైన‌ది. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అనేది అంద‌రికి ఉండాలి. ఉంటేనే అది
ప్ర‌జాస్వామ్యం. అయితే ఇంత‌లా ఒకే అంశంపై పార్ల‌మెంటులో ఒక పార్టీ గొడ‌వ చేయ‌డం ఏమిటి?

దీనికి అడ్డు ఆపూ లేదా? ప‌్ర‌త్యేక హోదాపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పార్ల‌మెంటు స‌భ్య‌లు, రిజ‌ర్వేష‌న్ల అంశంలో తెలంగాణ పార్ల‌మెంటు స‌భ్యులు కూడా
ఆందోళ‌న చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల నిర‌స‌న త‌ర్వాత వారు స‌భ‌ను న‌డ‌వ‌నిస్తున్నారు. అయితే ఈ త‌మిళ తంబిల ప‌రిస్థితి అందుకు
భిన్నంగా ఉంది. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కు అడ్డం ప‌డుతున్నారు. బిజెపిపై అవిశ్వాసం చ‌ర్చ‌కు రాకుండా చేస్తున్నారు. ఏ ప్ర‌భుత్వంపైన అయినా
స‌రే అవిశ్వాస తీర్మానం ప్ర‌తిపాదించే వ‌ర‌కూ రాకూడ‌దు. రాజ‌కీయ కార‌ణాల‌తోనో, ప‌రిపాల‌నా వైఫ‌ల్యం కార‌ణంగానో అవిశ్వాస తీర్మానం స‌భ
ముందుకు వ‌స్తే దాన్నే ప్ర‌ధాన ఎజెండాగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌స్తే అందులో అన్నా డిఎంకె వారు కూడా త‌మ
స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వాన్ని అభిశంసించ‌వ‌చ్చు. అయితే అవిశ్వాస తీర్మానానికి అడ్డంప‌డి బిజ‌పి ప్ర‌భుత్వాన్ని వారు ఎందుకు
కాపాడుతున్నారో వారికే తెలియాలి. ఇలే అప‌వాదు టిఆర్ ఎస్ పార్టీపై కూడా వ‌చ్చింది. సాక్ష్యాత్తూ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీనే
తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను ప్ర‌శ్నించారు – మీరు బిజెపికి వ్య‌తిరేకం అంటున్నారు. మ‌రి అవిశ్వాసాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు – అని.
దాంతో కె సి ఆర్ త‌న ఎంపిల‌తో స‌మావేశ‌మై ఆందోళ‌న‌ను త‌మ స్థానాల‌కే ప‌రిమితం చేయాల‌ని వెల్ లోకి వెళ్ల‌వద్ద‌ని కోరారు. దాంతో కె సిఆర్
చిత్త‌శుద్ధిని బిజెపి వ్య‌తిరేకులంతా ప్ర‌శంసించారు.

ఇదే విష‌యం అన్నా డిఎంకె వారికి కూడా వ‌ర్తిస్తుంది. బిజెపిని వారు కాపాడుతున్నార‌నేది దాచినా దాగ‌ని స‌త్యం. ఎందుకు?
వారికే తెలియాలి. అన్నా డిఎంకె ఇన్ని రోజులుగా గొడ‌వ చేస్తున్న‌ది క‌దా మ‌రి అధికార బిజెపి వారితో ఎందుకు చ‌ర్చించ‌దు? స‌మ‌స్య ప‌రిష్కారానికి
ఎందుకు చ‌ర్య‌లు తీసుకోదూ?

తీసుకోదు. ఎందుకంటే అలాంటి చొర‌వ తీసుకుంటే త‌మ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌స్తుంది. స‌భ‌లో ప్ర‌తి రోజూ బిజెపి త‌ర‌పున హోం
మంత్రో, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రో చెబుతూనే ఉంటారు. అన్ని అంశాలు చ‌ర్చిద్దాం… చ‌ర్చిద్దాం అని. అయితే అందుకు అనుగుణ‌మైన
చ‌ర్య‌లు మాత్రం తీసుకోరు.

బిజెపికి ఒంట‌రిగానే మెజారిటీ ఉంది. అవిశ్వాసానికి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అవిశ్వాస తీర్మానం స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చినా కూడా
సునాయాసంగా నెగ్గ‌గ‌లుగుతుంది. అయినా అవిశ్వాసాన్ని స‌భ‌లోకి రాకుండా ప‌రోక్షంగా అడ్డ‌కుంటుంన్నారు. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగితే త‌మ
బండారం బ‌య‌ట ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా? త‌మ పాల‌న‌లోని లోపాలు వెలికి వ‌స్తాయ‌ని అనుకుంటున్నారా?
ఇక్క‌డే ఇంకో అంశం వెలికి వ‌స్తున్న‌ది.

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి ఢిల్లీ వెళ్లిన‌పుడు ఆమెతో బిజెపి అసంతృప్త నాయ‌కులు అంద‌రూ క‌లిశారు. మాజీ కేంద్ర మంత్రులు య‌శ్వంత సిన్హా,
అరుణ్‌శౌరి, శ‌తృఘ‌న్ సిన్హా లాంటి వారు ఆమెను క‌లిసిన వారిలో ఉన్నారు. వీరంతా మోడీ బాధితులు. ఇదే విధంగా బిజెపిలో చాలా మంది
ఉన్నార‌ట‌. వారంతా అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ట‌. ఇదే కాబోలు మోడీ ప‌రివార్ భ‌యం. అందుకే కాబోలు అన్నా డిఎంకెతో
గొడ‌వ చేయిస్తున్నారు?

వీట‌న్నింటికి సాక్ష్యాలు ఉండ‌వు. రుజువులు తెమ్మంటే తీసుకురాలేం కానీ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేస్తున్నందుకు ఇలాంటి అనుమానాలే
విజృభిస్తుంటాయి.

English Summery: Loksabha adjournments are making the people to understand the union government in a different angle. The only one party making interruptions in the house. BJP should manage that party to take up the no confidence motion, but not doing that. 

Leave a Reply