లోకేష్ స‌భ‌లో “రావాలి జగన్-కావాలి జగన్” –ఎక్కడ! ఎందుకో?

Share Icons:

తిరుపతి, ఫిబ్రవరి 09,

ముఖ్య‌మంత్రి త‌న‌యుడు..మంత్రి నారా లోకేష్ స‌భ నవ్వుల‌పాయింది. శనివారం  ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ల‌క్ష‌ల గృహ‌ప్ర‌వేశాల‌ను నిర్వ‌హించింది. ఇందులో భాగంగా  ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు తిరుపతిలో పర్యటించారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వం భారీ ఎత్తున బహిరంగ సభ చేపట్టింది. ఏర్పాట్లు కూడా ఆర్భాటంగానే ఉన్నాయి. వందల సంఖ్యలో  కుర్చీలు వేశారు. ఇక్కడే తేడా వచ్చింది. వాటిపై జగన్ స్టిక్కర్లు ఉన్నాయి. జగన్ కావాలి.. జగన్ రావాలి అనే స్లోగన్స్ కూడా ఉన్నాయి.

సభలో ఏర్పాటు చేసిన చాలా కుర్చీలపై ఇలాంటి జగన్ బొమ్మలు దర్శనం ఇవ్వటం కలకలం రేపింది.   టీడీపీ కార్యక్రమంలో జగన్ ఫొటోలున్న కుర్చీలు కనిపించడంతో మీడి యా ప్రతినిధులు అక్కడకు చేరుకుని చిత్రీకరించడం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు ఆ కు ర్చీలను సభా ప్రాంగణం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా సభకు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. జ‌గ‌న్ స‌భ‌కు ఏర్పాటు చేసిన‌వారే.. లోకేష్ స‌భ‌లో జ‌గ‌న్ స్టిక్క‌ర్లు అంటించిన కుర్చీలు వేయ‌టంతో ఒక్క సారిగా క‌ల‌క‌లం మొద‌లైంది. నిర్వ‌హ‌కుల్లో టెన్ష న్ ప్రారంభ‌మైంది .

ఆ కుర్చీలు ఉద్దేశ పూర్వ‌కంగా తీసుకొచ్చారా.. ఎలా వ‌చ్చాయ‌నే అంశం పై ఆరా తీసారు. రెండ్రోజుల క్రితం తిరుపతిలో జగన్ ‘సమర శంఖారావం’ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి అందించిన కుర్చీలనే తాజాగా ఇప్పుడు టీడీపీ సభకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహకులపై చిందులు వేశారు. ఇంత పెద్ద సభ జరుగుతుంటే.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ చిర్రుబుర్రులాడారు.

కొసమెరుపు…

లోకేష్ సభ వ్యవహారం ప్రసారం చేయవద్దని మీడీయాను టిడిపి నేత‌లు ఎంత కోరినా..ఈ వ్య‌వ‌హారం పెద్ద ఎత్తున ప్ర‌సారమయింది. దీనిని చూసి వైసిపి నేత‌లు న‌వ్వుకుంటుండ‌గా..టిడిపి నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

 

మామాట: అనుకున్నదొకటి, అయినదొకటి… బుల్ బుల్ పిట్టా…..

Leave a Reply