సుప్రీం కూడా తేల్చేయడంతో వైసీపీ డిఫెన్స్‌లో పడిందా…టీడీపీకి కొత్త జోష్ వచ్చిందా?

ap cm jagan recommended cbi inquiry on tdp former mla and chandrababu ready to help tdp leader
Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే అంశం ఎన్నికల సంఘం చేతిలోనే ఉందని సుప్రీం కోర్టు చెప్పడంతో ఏపీలోని జగన్ ప్రభుత్వానికి పెద్ద షాక్ కొట్టినట్లు అయింది. అసలు ఈ  స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్లుగా మారింది. ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకూ వరుసగా తప్పు బడుతూ రమేష్ కుమార్ పైన విరుచకుపడ్డారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిర్ణయం జరిగిందంటూ ఆరోపించారు. అయితే, దీని పైన సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి అక్కడా చుక్కెదురైంది.

ఇక, ఇప్పుడు దీనిని టీడీపీ తమ అనుకూల అస్త్రంగా మలచుకొని అధికార పార్టీ మీద ఎక్కుపెడుతోంది. వైసీపీ సైతం ఎన్నికల సంఘం నిర్ణయం మీద అవసరానికి మించి స్పందించి..ఇప్పుడు సమాధానం చెప్పుకో వాల్సిన పరిస్థితిలో నిలబడిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. టీడీపీకి అవకాశం ఇచ్చేలా..వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది.

తమకు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ఏకపక్ష విజయాల దిశగా దూసుకెళ్తున్న వైసీపీ స్పీడ్ కు ఇప్పుడు బ్రేకులు పడ్డాయనేది టీడీపీ నేతల అంచనా. ఎన్నికలు వాయిదా పడటంతో తాము స్థానికంగా ఎన్నికలకు సిద్దపడే సమయం దొరికిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది.

ఇక ఎన్నికలు వాయిదా వేసే సమయానికి ఏగ్రీవాలైన స్థానాల్లో ఎక్కువగా వైసీపీ దక్కించుకున్నవే. ఇక, ఎన్నికలు జరిగినా..అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేసారు. అయితే, ఇప్పుడు ఎన్నికల సంఘం కరోనా కారణంగా ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేసింది. ఆ సమయంలో వైసీపీ నేతలు స్పందించిన తీరు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి కారణమైందనే భావన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతుంది. అధికార వైసీపీ కొట్టిన దెబ్బకు స్థానిక ఎన్నికల్లో దాదాపు చేతులెత్తేసిన టీడీపీకి..తాజా పరిస్థితులు అనుకూలగా కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికలు జరగటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

దీంతో..ఇప్పుడు టీడీపీ కేడర్ ఎన్నికల్లో వైసీపీకి పోటీ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవటానికి వెసులుబాటు కలిగింది. అయితే, ఎన్నికలు ఎప్పుడు జరిగినా..ఫలితాలు మాత్రం వైసీపీకే అనుకూలంగా ఉంటాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a Reply