ఎన్నికల వాయిదా ఆరు వారాలా? మూడు నెలలా? ఏకగ్రీవాలకు మళ్ళీ ఎన్నికలు?

another-two-years-extension-for-local-status-in-ap-who-shift-from-telangana
Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే. తొలుత ఆరు వారాల పాటు వాయిదా అని చెప్పిన..ఆ తరువాత కరోనా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే, దీనిని అంగీకరించటానికి సిద్దంగా లేని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడా ఎన్నికల సంఘానికి మద్దతుగా తీర్పు వచ్చింది.అయితే,ఎన్నికల సంఘం కోడ్ అమల్లో ఉంటుందని ఇచ్చిన ఆదేశాలను మాత్రం సుప్రీం కోర్టు రద్దు చేసింది.

ఫలితంగా కోడ్ సడలించారు. అయితే, అక్కడే చిక్కుముడి ఏర్పడింది. ఇప్పుడు దేశం మొత్తంగా కరోనా స్టేజ్ 2 కంటిన్యూ అవుతోంది. రానున్న రోజులు మరింత కీలమని చెబుతున్నారు. దీంతో..అసలు ఎన్నికలు ఆరు వారాల్లో సాధ్యమేనా..కోడ్ సడలించిన తరువాత ఇప్పటికే దాఖలైన నామినేషన్లు లైవ్ లో ఉంటాయా. తాజాగా నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలు.. కోర్టులో దాఖలైన కేసులు చూస్తుంటే..ఎన్నికల షెడ్యూల్ సైతం రద్దు చేసి..రీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దీని పైన ఎన్నికల సంఘం మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

కరోనా ఉధృతి తగ్గితే వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. అయితే సుప్రీంకోర్డు ఆదేశాలతో మరో 4 వారాల పాటు ఎన్నికల కోడ్‌ అమలు చేసి ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఎస్‌ఈసీకి లభించింది. కరోనా వ్యాప్తి నిరోధానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అనుకున్నా.. ఆ తర్వాత ఎన్నికల కోసం మరో నెల పడుతుంది. అంటే ఇంకో మూడు నెలల తర్వాతే స్థానిక ఎన్నికలకు అవకాశముందనే అంచనాలు కనిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల కోడ్‌ అమలు తాత్కాలికంగా వాయిదాపడింది. ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులు రంగంలో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ, జరిగిన ఏకగ్రీవాలపై పలు ఆరోపణలున్నాయి. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న ఈ అంశంపై కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. కోడ్‌ అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడం ఎంత వరకు సబబని పలు రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

దీనిని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలా.. రద్దు చేయాలా అన్నది రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. దీంతో..ఇప్పటి వరకు జరిగిన పక్రియ యధాతధంగా ఉంటుందని..భవిష్యత్ లో జరగాల్సిన వ్యవహారం మాత్రమే నిలిపవేసామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

 

Leave a Reply