నూతన ఫీచర్లతో విడుదలైన ఎల్‌జీ, టెక్నో కొత్త ఫోన్లు…

LG W10 Alpha With Waterdrop-Style Notch
Share Icons:

ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ డబ్ల్యూ10 ఆల్ఫాను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు త్వరలో కొనుగోలు చేయవచ్చు.

ఎల్‌జీ డబ్ల్యూ 10 ఆల్ఫా ఫీచర్లు…

5.71 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

1.6 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌

32 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్‌ సిమ్‌

8, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.1

3450 ఎంఏహెచ్‌ బ్యాటరీ

టెక్నో మొబైల్స్‌.. కామన్‌ 15, 15 ప్రొ

టెక్నో మొబైల్స్‌.. కామన్‌ 15, 15 ప్రొ పేరిట భారత్‌లో రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను తాజాగా విడుదల చేసింది. కామన్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ రూ.9,999 ప్రారంభ ధరకు లభిస్తుండగా, 15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ రూ.14,999 ధరకు లభిస్తున్నది. వీటిని ఈ నెల 25వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

టెక్నో కామన్‌ 15 ఫీచర్లు…

6.55 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే

ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10

48, 5, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

హైఫ్యూచర్‌ కంపెనీ ఫ్లై బడ్స్‌

హైఫ్యూచర్‌ కంపెనీ ఫ్లై బడ్స్‌ పేరిట నూతన  వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.2499 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ వినియోగదారులకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లలో లభిస్తున్నాయి. ఇవి బ్లూటూత్‌ 5.0 ద్వారా ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ అవుతాయి. వీటిలో ఎన్‌42 డైనమిక్‌ నియోడైమియం మాగ్నెట్‌ డ్రైవర్స్‌ను ఏర్పాటు చేసినందున సౌండ్‌ క్వాలిటీ బాగుంటుంది. డీప్‌ బేస్‌ను  ఇవి అందిస్తాయి. ఆపిల్‌ సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌లకు వీటిలో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఇవి 4 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్‌ కేస్‌తో అయితే 15 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చు. యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు ద్వారా వీటిని ఫాస్ట్‌గా చార్జింగ్‌ చేసుకోవచ్చు.

 

Leave a Reply