త్వరలో ఎల్‌జి నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్…

LG G8s ThinQ With Snapdragon 855 SoC, Triple Rear Cameras Launched in India
Share Icons:

ముంబై: దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వి60 థిన్‌క్యూ 5జి ని త్వరలో విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

ఎల్‌జీ వి60 థిన్‌క్యూ 5జి ఫీచర్లు…

6.8 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ విజన్‌ పి-ఓలెడ్‌ డిస్‌ప్లే

2460 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌

128/256 జీబీ స్టోరేజ్‌, 2టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్‌ 10, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

64, 13 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 5జి, 4జీ వీవోఎల్‌టీఈ

10 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, బ్లూటూత్‌ 5.1 ఎల్‌ఈ

ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాల్‌కామ్‌ క్విక్‌ చార్జ్‌ 4 ప్లస్‌

ఒప్పో ఎ31

మొబైల్స్‌ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎ31ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.11,490 ఉండగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.13,990గా ఉంది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 29వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

ఒప్పో ఎ31 ఫీచర్లు…

6.5 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌

ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి35 ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌

64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై

12, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0

4230 ఎంఏహెచ్‌ బ్యాటరీ

లెనోవో ఇయర్‌బడ్స్‌

లెనోవో కంపెనీ హెచ్‌టీ10 ప్రొ, హెచ్‌టీ20 పేరిట నూతన ఇయర్‌బడ్స్‌ను హెచ్‌ఈ18 ఇయర్‌ఫోన్స్‌ను, హెచ్‌డీ116 పేరిట నూతన హెడ్‌సెట్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. హెచ్‌టీ10ప్రొ ఇయర్‌బడ్స్‌ 48 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. ఇవి బ్లూటూత్‌ 5.0 ద్వారా కనెక్ట్‌ అవుతాయి. రూ.4599 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే లెనోవో హెచ్‌టీ20 ఇయర్‌బడ్స్‌ రూ.3399 ధరకు లభిస్తున్నాయి. ఇవి 25 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటికి ఐపీఎక్స్‌5 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. లెనోవో హెచ్‌ఈ18 ఇయర్‌ఫోన్స్‌ ధర రూ.1199 ఉండగా, ఇవి 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. ఇక లెనోవో హెచ్‌డీ 116 హెడ్‌సెట్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఇది బ్లూటూత్‌ 5.0 ద్వారా కనెక్ట్‌ అవుతుంది. దీన్ని రూ.2499 ధరకు కొనుగోలు చేయవచ్చు.

 

Leave a Reply