ఆకర్షణీయమైన ఫీచర్లతో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన లెనోవో..

lenovo think book 14 and 15 laptops released in india
Share Icons:

ముంబై: ప్రముఖ మొబైల్స్ తయారీదారు లెనోవో కంపెనీ థింక్‌బుక్ సిరీస్‌లో రెండు నూతన ల్యాప్‌టాప్‌లను భారత్‌లో విడుదల చేసింది. లెనోవో థింక్‌బుక్ 14, థింక్‌బుక్ 15 మోడల్స్‌లో ఆ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. ఈ ల్యాప్‌టాప్‌లు వినియోగదారులకు రూ.30,990 ప్రారంభ ధరకు డిసెంబర్ మొదటి వారం నుంచి లభ్యం కానున్నాయి.

థింక్‌బుక్ 14లో 14 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఏఎండీ రేడియాన్ 625 గ్రాఫిక్స్, 24 జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్, 2టీబీ వరకు హార్డ్ డిస్క్, 1టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ప్రొ ఓఎస్, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ ఆడియో, 57 వాట్ అవర్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

అలాగే థింక్‌బుక్ 15లో 15.6 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఏఎండీ రేడియాన్ 620 గ్రాఫిక్స్, 24 జీబీ వరకు ర్యామ్, 2టీబీ వరకు హార్డ్‌డిస్క్, 1టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ప్రొ ఓఎస్, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ ఆడియో, 57 వాట్ అవర్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

శాంసంగ్ కార్నివాల్ సేల్

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో శాంసంగ్ కార్నివాల్ సేల్ జరుగుతుంది. ఈ సేల్ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు శాంసంగ్ ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్, గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్, గెలాక్సీ ఎ50, ఎ30ఎస్ తదితర ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్లను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.6వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.

స్మార్ట్‌బ్యాండ్‌

షియోమీ ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఎంఐ బ్యాండ్ 3ఐ పేరిట విడుదలైన ఈ బ్యాండ్‌లో 0.78 ఇంచుల ఓలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, స్లీప్ ట్రాకర్, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 110 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.1299 ధరకు ఈ బ్యాండ్‌ను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

 

Leave a Reply