సూపర్ ఫీచర్లతో లెనోవో నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు…

lenovo released three new smartphones in india
Share Icons:

ముంబై:

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు లెనోవో తాజాగా అదిరిపోయే ఫీచర్లతో మూడు స్మార్ట్ ఫోన్లని విడుదల చేసింది. అందులో మొదట జడ్6 ప్రొ పేరిట విడుదల చేసింది. లెనోవో జడ్6 ప్రొ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల కాగా ఈ ఫోన్‌ను రూ.33,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 11వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన బెనిఫిట్స్‌ను అందివ్వనుంది. అలాగే రూ.1500 విలువైన మేక్ మై ట్రిప్, రూ.2వేల విలువైన జూమ్ కార్ కూపన్లు జియో నుంచి లభిస్తాయి. అందుకు గాను యూజర్లు రూ.299 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

లెనోవో జడ్ 6 ప్రొ ఫీచర్లు…

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్

128 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

ఆండ్రాయిడ్ 9.0పై, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

48, 16, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు

32 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి

4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

లెనోవో.. కె10

లెనోవో.. కె10 నోట్ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999గా ఉంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

కె10 ఫీచర్లు

6.39 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

లెనోవో ఎ6

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ6 నోట్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 11వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది.

ఫీచర్లు

6.09 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Leave a Reply