అత్యాధునిక ఫీచర్లతో ఫోల్డబుల్‌ పీసీని విడుదల చేసిన లెనోవో

Share Icons:

ముంబై: ప్రముఖ టెక్ సంస్థ లెనోవో.. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ పీసీని లాంచ్‌ చేసింది. థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 ఫోల్డ్‌ పేరిట లెనోవో ఆ పీసీని విడుదల చేసింది. రూ.1.79 లక్షల ధరకు ఈ పీసీని వినియోగదారులు త్వరలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 13.3 ఇంచుల ఫోల్డింగ్‌ ఓలెడ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ పీసీ 1 కిలో కన్నా తక్కువ బరువును కలిగి ఉంటుంది. దీనికి బ్లూటూత్‌ మినీ ఫోల్డ్‌ కీబోర్డ్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ కీ బోర్డ్‌ను డిస్‌ప్లే పై భాగంలో కనెక్ట్‌ చేసుకోవచ్చు. లేదా విడిగా కూడా కనెక్ట్‌ చేయవచ్చు. ఇక మల్టీ టాస్కింగ్‌ కోసం ఈ పీసీని రెండు భిన్నమైన డిస్‌ప్లేలకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ పీసీలో యూఎస్‌బీ టైప్‌ సి, ఇంటెల్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ కోర్‌ ప్రాసెసర్‌, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తదితర ఇతర ఫీచర్లను కూడా అందిస్తున్నారు.

శాంసంగ్‌ గెలాక్సీ క్రోమ్‌బుక్‌

శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ క్రోమ్‌బుక్‌ పేరిట ఓ నూతన క్రోమ్‌బుక్‌ను విడుదల చేసింది. రూ.71,898 ప్రారంభ ధరకు ఈ క్రోమ్‌బుక్‌ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో.. 13.3 ఇంచుల 4కె అమోలెడ్‌ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, ఇంటెల్‌ కోర్‌ ఐ5 10వ జనరేషన్‌ ప్రాసెసర్‌, ఇంటెల్‌ అల్ట్రా హెచ్‌డీ గ్రాఫిక్స్‌, 16 జీబీ వరకు ర్యామ్‌, 1టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ, వైఫై 6, బిల్టిన్‌ పెన్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, 1 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 8 మెగాపిక్సల్‌ కీబోర్డ్‌ డెక్‌ కెమెరా, యూఎఫ్‌ఎస్‌/మైక్రో ఎస్‌డీ కార్డ్‌ రీడర్‌, 49.2 వాట్‌ అవర్‌ బ్యాటరీ, క్రోమ్‌ ఓఎస్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

 

అమెజాన్‌ ఎకో ఆటో

ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన ఎకో సిరీస్‌లో మరో నూతన డివైస్‌ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఇక ఈ డివైస్‌ను రూ.4,999 ధరకు వినియోగదారులు అమెజాన్‌ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌ ఎకో ఆటో పేరిట విడుదలైన ఈ డివైస్‌ను యూజర్లు తమ కార్లలో అమర్చుకోవచ్చు. కారులోని 12 వోల్టుల చార్జింగ్‌ సాకెట్‌ లేదా యూఎస్‌బీ పోర్టు ద్వారా ఈ డివైస్‌ పవర్‌ తీసుకుంటుంది. దీన్ని ఫోన్‌కు బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు. అనంతరం ఫోన్‌లో ఉండే అలెక్సా యాప్‌ సహాయంతో ఉపయోగించుకోవచ్చు.

 

Leave a Reply