న్యాయ సలహా : గల్ఫ్

Share Icons:

నేను ఒక కంపనీ లో సేల్స్ ఎక్సిక్యూటివ్ గా పని చేస్తున్నాను. ఈ కంపనీ లో చేరినప్పుడు నా జీతం 450 కువైట్ దినార్లు. ఈ సంవత్సరానికి గాను నాకు బేసిక్ శాలరీ ఇంక్రిమెంట్ తరువాత ఇప్పుడు నేను 625 కువైట్ దినార్లు జీతం తీసుకుంటున్నాను. నేను నా రెసిడెన్స్ మార్చ్ 2016 న రెన్యూ చేయించాను. అయితే నా వర్క్ పర్మిట్ (Izen Amel) లో ఇప్పటికి 545 కువైట్ దినార్లు గా చూపిస్తోంది.

నేను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ని లైసెన్స్ కోసం మా కంపెనీ శాలరీ సర్టిఫికేట్ తో కలవగా అక్కడి అధికారులు నాకు చెప్పినది ఏమంటే వర్క్ పర్మిట్ లో ఏదయితే శాలరీ ఉందొ అదే సర్టిఫికేట్ లో కూడా ఉండాలి అని. అది రెసిడెన్స్ రెన్యూ చేయిన్సుకున్నప్పుడే మారుస్తారు అని. సాంకేతికంగా చూస్తే మళ్ళీ నా రెసిడెన్స్ 2 ఏళ్ల తరువాత అనగా ఫెబ్రవరి 2018 కి రెన్యూ చేయించాలి.

దీనికి ఎమన్నా ప్రత్యామ్నాయం ఉందా? వర్క్ పర్మిట్ (Izen Amel) , రెసిడెన్స్ మధ్య మనమేమన్న తరుణోపాయం చూడగలమా? తెలుపగలరు.

జవాబు: రెసిడెన్స్ వాలిడిటీ ఉన్నప్పుడు వర్క్ పర్మిట్ ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చలేము.సాధారణంగా ఈ వర్క్ పర్మిట్స్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ లేబర్ / పబ్లిక్ పవర్ అథారిటి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అవి ట్రాన్స్ఫర్ అయినప్పుడు లేదా రెసిడెన్స్ పొడిగింపు సమయంలో జరుగుతాయి.
కాబట్టి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చెప్పినది కరెక్ట్. వర్క్ పర్మిట్ లో ఈ జీతం అయితే ఉందొ దేశంలో ఏ లావాదేవీ జరిగినా అదే జీతం పరిగణలోకి తీసుకుంటారు.

సోర్స్ http://www.kuwaitup2date.com/update-work-permit/

అనువాదం : సాహితీ రత్న

 

Leave a Reply