చరిత్ర సృష్టించిన లియాండర్ పేస్

చరిత్ర సృష్టించిన లియాండర్ పేస్
Views:
38

తీయంజీన్, ఏప్రిల్:

చైనా లోని తీయంజీన్ జరుగుతున్న డేవిస్‌ కప్‌లో భారత్ టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ చరిత్ర సృష్టించాడు.

43 సార్లు డేవిస్ కప్ డబుల్స్‌ గెలిచిన అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు. డేవిస్ కప్‌లో చైనాతో ఆసియా/ఓసియానియా గ్రూప్‌ టైలో పేస్‌ జోడీ విజయం సాధించింది.

శనివారం(ఏప్రిల్-7) జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న, పేజ్ జోడి చైనా జంటపై 5-7, 7-6, 7-6 స్కోరుతో సునాయసంగా విజయం సాధించింది.

అయితే టోర్నీలో భారత్ 1-2 పాయింట్ల తేడాతో చైనా కంటే వెనుకంజలోనే ఉంది. ఈ టోర్నీలో ఇంకా రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇది పేస్‌కి 43 విజయం కాగా, పేస్ కంటే ముందు ఇరాన్‌కు చెందిన నికోలా పిట్రాంగిలీ డేవిస్ కప్ డబుల్స్‌లో 42 విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డుని పేస్ అధిగిమించి చరిత్ర సృష్టించాడు.

మామాట: తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించిన పేస్..

English summary:

Indian tennis’ ageless wonder Leander Paes today became the most successful doubles player in the history of Davis Cup as he combined with Rohan Bopanna to not only grab a record 43rd win but also bring the country back in the tie against China here.

(Visited 45 times)
%d bloggers like this: