న్యాయం కోరి వచ్చిన మహిళపై అత్యాచారం… బ్లాక్‌మెయిల్‌!

Share Icons:
  • మత్తిచ్చి నగ్న ఫోటోలు తీశాడు
  • ఆపైన అత్యాచారం చేశాడు
  • నగ్న ఫోటోలు చూపించి 7లక్షలు వసూలు చేశాడు
  • మర్లామర్లా డబ్బుకోసం వేధించ సాగాడు

విడాకుల కోసం ఆశ్రయించిన మహిళపై అత్యాచారం చేసి నగ్నఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేసిన న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… తిరువళ్లూర్‌ సమీపంలోని మనవాళనగర్‌కు చెందిన వివాహిత విడాకులు తీసుకోవడానికి తిరువళ్లూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది డార్జన్‌ (44)ని కలిసింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ఇంటికి వచ్చి తీసుకుంటానని న్యాయవాది చెప్పాడు. ఆ తర్వాత మహిళ ఇంటికి వెళ్లిన డార్జన్‌ శీతలపానియంలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆమె స్పృహతప్పడంతో నగ్న ఫొటోలను తీశాడు. అనంతరం అత్యాచారం చేశాడు.

నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి రూ.7 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఊరుకోకుండా నగదు కోసం పలుమార్లు ఆమెకు బెదిరించ సాగాడు. దీనిపై ఆమె తిరువళ్లూరు మహిళా కోర్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొడైక్కెనాల్‌లో ఉన్న డార్జన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply