లంక  దాడులు- బంగాళాఖాతంలో యుద్ధనౌకలు,  విమానాలు మోహరించిన భారత్ 

Share Icons:

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 22,

శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ తీర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో బంగాళాఖాతంలో యుద్ధనౌకలు మోహరించారు. అంతేకాదు, కీలకమైన డోర్నియర్ నిఘా విమానాలను కూడా భారత తీరప్రాంత రక్షక దళం సిద్ధం చేసింది.

ఆత్మాహుతి దాడులను అడ్డుకునేందుకు కోస్ట్ గార్డ్ అన్ని విధాలుగా సన్నద్ధమైంది. కాగా, శ్రీలంకలో ఈ అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధించనున్నారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటన చేస్తారు.

మామాట: అన్నిటికీ సిద్దంగా ఉన్నామనమాట

Leave a Reply