చంద్రబాబుతో సహ ఆ ఇద్దరు జైలుకు వెళ్ళడం నేను చూస్తా…

ysrcp leader lakshmi parvathi comments on chandrababu
Share Icons:

తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు జైలుకు వెళ్ళే గతి రాసి ఉందని అన్నారు. ఆమె తన భర్త ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో చంద్రబాబు విషయంలో ఆయన ఏం చెప్పేవారో గుర్తు చేసుకున్నారు.తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుపై ఎన్టీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారో లక్ష్మీ పార్వతి తెలియజేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోకముందు చివరి రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారని ఆమె గుర్తు చేశారు .

ఇక మళ్లీ తాను అధికారంలోకి వస్తే తాను చంద్రబాబును తప్పకుండా అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని తనతో అన్నట్లు లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద సిట్ విచారణ కొనసాగుతుంది. త్వరలోనే ఆ గతి వస్తుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఏపీలో గత పాలనపై ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వాస్తవాలన్నీ బయటకు వస్తాయని, త్వరలోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి ముగ్గురూ జైలుకెళ్లడం తాను చూస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలోనూ పలు మార్లు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మీ పార్వతి ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా కోర్టు మెట్లెక్కారు.

 

Leave a Reply