లక్ష్మీ పార్వతికి పదవి తిప్పలు…హోదాలేని పదవి…?

Sexual harassment case against Lakshmi Parvathi
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలి మీద వెళుతూ విమర్శలు చేసే లక్ష్మీ పార్వతికి సీఎం జగన్ ఓ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. నామినేటెడ్ పోస్టులో భాగంగా తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ పదవిని ముఖ్యమంత్రి జగన్ కట్టబెట్టారు. అయితే, ఇది జరిగి మూడు నెలలవుతన్నా..అధికారులు మాత్రం కొర్రీ పెడుతున్నారు. అసలు ఆ హోదానే లేదంటూ షాక్ ఇచ్చారు. అనేక రోజులుగా దీని పైన తన స్థాయిలో చర్చలు చేసిన లక్ష్మీ పార్వతికి చివరకు ముఖ్యమంత్రికి తన సమస్య చేరవేసారు. దీంతో..ఇప్పుడు లక్ష్మీపార్వతి సమస్యపైన దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.

తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్‌గా నందమూరి లక్ష్మీ పార్వతిని మూడు నెలల కిందట నియమించారు. కేబినెట్ హోదా కల్పించారు. హోదాకు తగిన విధంగా జీత..భత్యాలను ఖరారు చేసారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి లక్ష్మీపార్వతికి రూపాయి కూడా అందలేదు. మూడు నెలలుగా జీతం సైతం ఇవ్వటం లేదు. ఈ విషయం పైన ప్రభుత్వంలోని ముఖ్యులతో లక్ష్మీ పార్వతి చర్చించటంతో.. ఆమెకు జీతం ఇవ్వాలని సూచిస్తూ సాధారణ పరిపాలన శాఖ విద్యా శాఖకు ఫైల్ పంపింది. అయితే, తెలుగు అకాడమీ విభజన చట్టం షెడ్యూల్ 10లో ఉంది. అకాడమీ విభజన ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలో తమ శాఖ పరిధిలోనే కాదు రాష్ట్రంలోని లేని ఛైర్ పర్సన్‌కు వేతనం ఇవ్వలేమని ఉన్నత విద్యా శాఖ చెప్పింది.

అయితే, లక్ష్మీ పార్వతికి లేని హోదా కల్పించారా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది. నేరుగా ముఖ్యమంత్రి నామినేట్ చేసి..కేబినెట్ హోదా కల్పించిన వ్యక్తికి వేతనాలు నిలుపుదల చేయటమే ఈ చర్చకు కారణమైంది. అసలు ఆ పోస్టు లేకుండా ఎలా ఇచ్చారనేదే అసలు ప్రశ్న. ఇది బయటకు రావటంతో..ఇప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. సాధారణ పరిపాలన శాఖ తన బడ్జెట్ నుండి లక్ష్మీ పార్వతికి జీత భత్యాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. తెలుగు అకాడమీని సొసైటీస్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసే పనులు జరుగుతున్నాయని.. అప్పటి వరకు తామే జీత భత్యాలు ఇస్తామని జీవోలో స్పష్టం చేసారు.

 

Leave a Reply