మహానాయకుడు..చంద్రబాబు భజన…!

Share Icons:

హైదరాబాద్, 22 ఫిబ్రవరి:

బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా..‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినీ జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథనాయకుడు’ సంక్రాంతి విడుదలై కమర్షియల్‌ విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈనేపథ్యంలో కొన్ని మార్పులు చేసి ఈరోజు ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇక ఈ చిత్రంపై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి స్పందించారు.

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను చంద్రబాబు భజన కోసమే తీసినట్టువుందనే వార్తలు వస్తున్నాయన్నారు. బాలయ్య అంతకు మించి ఏమి చేయలేరని ఆమె వ్యాఖ్యానించారు. బాలకృష్ణ..చంద్రబాబుకు బామ్మర్థే కాకుండా స్వయానా వియ్యంకుడనీ,టీడీపీ ఎమ్మెల్యే అనీ, వారిద్దరి మధ్య వైస్రాయ్ ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాబట్టి బాలకృష్ణ..చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా చేసే సాహసం చేయలేకపోయాడని వ్యాఖ్యానించింది.

తనను సినిమాలో చూపిస్తే ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని సైతం చూపించాల్సి స్తుందని అందుకే తన పాత్ర పెట్టలేదని లక్ష్మీపార్వతి మండిపడింది.
ఎన్టీఆర్ చివరి రోజుల్లో అనుభవించిన కష్టాలు, తమ అనుబంధం ప్రధానంశంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఆ సినిమా కోసం నాతోపాటు చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నరన్నారు.

మామాట: మరి ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో

Leave a Reply