కోటప్పకొండ తిరునాళ్లు సందర్భంగా… త్రికోటేశ్వరునికి పట్టువస్త్రాలు సమర్పణ…!!

Share Icons:

గుంటూరు, 13 ఫిబ్రవరి:

మహా శివరాత్రి పూజలకు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ ముస్తాబైంది. మంగళవారం ఇక్కడ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

ప్రభుత్వం ఈ తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా కాగా, ఇందుకు తగ్గట్టు విస్తృత ఏర్పాట్లు చేశారు.

కోటప్పకొండ తిరునాళ్లు త్రికోటేశ్వరునికి ప్రభుత్వం తరుపున మంత్రి మాణిక్యాలరావు, స్పీకర్‌ కోడెల శివప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

మరోవైపు త్రికోటేశ్వరున్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.

భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు,

కలెక్టర్‌ కోన శశిధర్‌, ఎస్పీ అప్పలనాయుడు పర్యవేక్షించారు. 3 వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మామాట: భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నట్టున్నారు…

English Summary: Lakhs of pilgrims are expected visit Sri Trikoteswara Temple atop Kotappakonda near Narasaraopet as the Maha Sivaratri,’ festivities will start in a few hours in the early hours of Tuesday. Speaker Kodela Siva Prasada Rao will offer the ‘pattu vastramulu’ (silk robes), to the presiding deity. The festivities will reach a crescendo later in the evening when people bring long and illuminated poles, ‘prabhalu,’ to the hill shrine and spend the whole night on the temple premises chanting devotional hymns.

Leave a Reply