కోరిక తీర్చలేదని…ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌‌ని చంపేశాడు..!!

Share Icons:

ముంబై, 20 ఫిబ్రవరి:

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల యువతిని హత్య చేశాడు. లైంగిక చర్యకు ఆ అమ్మాయి నిరాకరించడంతో అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని నలసొపారాలో ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగింది.

తూర్పు ముంబైకి చెందిన హరిదాస్‌ నిర్గుడే (25), వాసి ప్రాంతానికి చెందిన అంకిత మోర్‌ (20)ని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. అలా కొన్ని నెలలుపాటు చాటింగ్ చేసుకుంటూ రావడంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

దీంతో గత ఆదివారం ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. చాటింగ్‌లో తీపి మాటల వెనక కుట్ర ఉందని తెలియక.. రాత్రి ఏడు గంటల సమయంలో న‌ల‌సోపార‌లోని అత‌డి ఫ్లాట్‌కి వెళ్లింది.

మాటల్లో పెట్టి, శృంగారానికి సహకరించాలని కోరాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో అత్యాచారం చేసి ఆపై షూ లేస్‌తో మెడకు ఉరిబిగించి చంపేసి శవాన్ని అపార్ట్‌మెంట్ మెట్లపై ప‌డేశాడు.

మెట్లపై ఆ శవాన్ని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. చివరకు హ‌రిదాస్ అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణలో అసలు విషయం అంగీకరించాడు. సెక్స్‌‌కు నిరాక‌రించింద‌న్న కోపంతో ఆమెను తానే చంపిన‌ట్టు అంగీక‌రించాడు.

మామాట: ముక్కూమొఖమూ తెలియని ముఖపుస్తక పరిచయాలు

English Summary: Ankita More (20) of Vashi was found dead on the ground-floor staircase of the Taniya Monarch building in Nallsopara East by residents at 7 pm. The man fled his home after strangling her with a shoelace.

Leave a Reply