TRENDING NOW

లోకేశ్‌కి షాక్ ఇచ్చిన మహిళలు..ఖాళీ బిందెలతో మంత్రి ఎదుట నిరసన…

లోకేశ్‌కి షాక్ ఇచ్చిన మహిళలు..ఖాళీ బిందెలతో మంత్రి ఎదుట నిరసన…

నరసాపురం, 6 డిసెంబర్:

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రి నారా లోకేశ్‌కు మహిళలు షాక్ ఇచ్చారు. నరసాపురం మండలంలోని స్థానికంగా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి కాన్వాయ్‌కు ఖాళీ బిందెలు అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు.

ఎప్పటి నుంచో తమ ప్రాంతానికి తాగునీటి వసతి కల్పించాలని అధికారులకు చాలాసార్లు మొర పెట్టుకున్న వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అపరిశుభ్రమైన నీటిని తాగడం కారణంగా తామంతా అనారోగ్యం పాలవుతున్నామని చెప్పారు. ఇక  గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో కారు దిగి బయటకు వచ్చిన మంత్రి లోకేశ్ వారితో మాట్లాడారు. తాగునీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Life Homepathy
treefurn AD

మామాట: ఇలా రాష్ట్రంలో కనపడని సమస్యలెన్నో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: