మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువే: ఎల్. రమణ

Share Icons:

హైదరాబాద్, 18 జనవరి:

ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

ఈ నేపథ్యంలో ఆయన పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన అన్నారు.

ఈ రాష్ట్రంలో పార్టీని భుజాన ఎత్తుకుని కాపాడుకుందామన్న దానికి సహకరించే వారు లేరన్నారు.

ఇక్కడి నేతలు మానసికక్షోభ అనుభవిస్తున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో పార్టీ పూర్తిగా లేదనిపించుకోవడం కంటే..టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడమే మంచిదన్నారు. అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని చెప్పారు.

ఇక మోత్కుపల్లి చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ తమ పార్టీలో అధికమని, ఎవరైనా మాట్లాడవచ్చని అన్నారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎల్ రమణ మీడియాతో మాట్లాడారు. మోత్కుపల్లి వ్యాఖ్యలను తానేమీ సీరియస్ గా తీసుకోవడం లేదని, ఆయనతో మాట్లాడతానని అన్నారు. నేతలు పార్టీలు మారినా క్యాడర్ తమతో పాటే ఉందని చెప్పారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడ్డారు.

మామాట: మోత్కుపల్లి మాటల మర్మమేమిటి యాదగిరేష..

English summary: Telangana TDP leader Motukupalli Narsimhulu paid tributes at NTR Ghat in the city during NTR’s death anniversary today. In this context he made sensational comments about the party. In Telangana, the situation in the Telugu Desam Party is worse. He said it is better to merge TDP into TRS. And L.Ramana said that the comments made by Muttukupalli are personal, that he can speak of freedom of speech and freedom of expression in tdp party.

Leave a Reply