జీవీఎల్…సాక్ష్యాలివ్వండి!

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 8:

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మత్యశాఖలో అవినీతి జరిగిందని ఆరోపణ చేశారని, ఆయనకు అవాస్తవాలు ప్రచారం చేయటం అలవాటుగా మారిందని ఏపీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కుటుంబరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అసలు మత్యశాఖకు బడ్జెట్ 600 కోట్లు అని, మరి ఎక్కడి నుంచి 6700 కోట్ల అవినీతి జరిగినట్లని, ఆధారాలు ఉంటే సమర్పించండని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సరైన సాక్ష్యాలు చూపించకపోతే నోటీసులు జారీ చేస్తామని అన్నారు.

ఇక అమరావతి బాండ్ లలో లిస్ట్ చెప్పట్లేదు అంటున్నారని, పబ్లిక్ ఇష్యూ చేసిన బాండ్స్ ఇన్వెస్టర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఫ్రాంక్లిన్ ఇండియా వంటి పేరున్న ట్రిలియన్ డాలర్ల కంపెనీ అమరావతి ప్రగతిలో ఇన్వెస్ట్  చేస్తే  అనుమానాలు రేకిస్తున్నారని,  అసత్య ప్రచారాలతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కుటుంబరావు ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యంత పారదర్శకంగా బాండ్ ఇష్యూ జరిగిందని, ఉండవల్లి ఆరోపణలు చేస్తున్నట్లు ఇందులో ఇక శాతం అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను 24 గంటల్లో రాజీనామా చేస్తాననని అన్నారు. ఆర్ధిక అంశాలపై ప్రజలకు పట్టు ఉండదని.. అవాస్తవాలతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారంలో తానెక్కడా కులం, మతం ప్రస్తావన తీసుకురాలేదని, కావాలంటే క్లిప్పింగ్ మొత్తం సరి చూసుకోవచ్చని చెప్పారు. అయితే రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగిందని ఉండవల్లి చెప్పకనే చెప్పారని,  మనీ టేకింగ్‌కి, మనీ మేకింగ్‌కి తేడా అంటే ఏంటో ఉండవల్లి చెప్పాలని కోరారు.

మామాట: మరి దీనిపై జీవీఎల్ ఎలా స్పందిస్తారో?

Leave a Reply