పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు…

Share Icons:

కర్నూలు, 26 ఫిబ్రవరి:

రాజకీయాలంటే సినిమాలు తీసినంత తేలిక కాదని, పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కర్నూలు వైసీపీ నేత చక్రపాణిరెడ్డి విమర్శించారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేకహోదా సాధించడం కోసం పోరాడుతున్నది ఒక్క జగన్మోహన్ రెడ్డేనని అన్నారు.

ఇక ప్రత్యేక హోదాపై జగన్‌కు క్రెడిట్ దక్కకూడదని చెప్పి పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు. హోదా విషయంలో ముఖ్యమంత్రి రోజుకో మాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

అలాగే రాజకీయాలంటే సినిమాలు తీసినంత తేలిక కాదని, పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై నిరసనలో భాగంగా మార్చి 1న తమ పార్టీ తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.

మామాట: ఎవరికి తగ్గ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు….

English summary:

Kurnool YSRCP leader Silpa Chakrapanireddy fires on CM Chandababu and Pawan Kalyan. He criticized the babu and pawan are playing drama on the AP special status.

Leave a Reply