పోలీసులపై కర్నూలు టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు…

Share Icons:

కర్నూలు: మరోసారి టీడీపీ నేత పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబర్‌లో పోలీసుల తీరుపై జేసీ దివాకర్ రెడ్డి బాహాటంగానే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చాలారోజుల తర్వాత కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారంటే…“మా ఇంటికి ఎవరైనా తాగివస్తేనే బయటకు పంపిస్తాం. అలాంటిది మా ఇంట్లో పోలీస్‌ అధికారులు సోదాలు నిర్వ హించి స్పిరిట్‌ క్యాన్లు ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేయడం కక్ష సాధింపు చర్యలు కాదా?’ అని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ప్రశ్నించారు.

అధికార పార్టీకి తొత్తులుగా మారి తమను ఏదో చేయాలనుకోవడం అవివేకమన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, మళ్లీ తాము అధికారంలోకి వస్తామని అన్నారు. పోలీసు అధికారులూ.. ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తా మని, వేధింపులకు పాల్పడిన పోలీస్‌ అధికారుల భరతం పడతామని అన్నారు.

రాజకీయాల్లో ఎంతో మందిని ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. టీడీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డోన్‌ నియోజకవర్గ ప్రజలంటే తమ కుటుంబానికి ప్రాణమన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, ప్రణాళిక ప్రకారం పనిచేసి గెలిచి నిలుద్దామని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే డిసెంబర్ 18వ తేదీన అనంతంపురంలో టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తా అని వారిని కించపరుస్తూ మాట్లాడారు.

 

Leave a Reply