ముఖ్యమంత్రిగా 82 రోజులు 40 ఆలయాల సందర్శన

Share Icons:

తిరుపతి, ఆగష్టు 14,

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 82 రోజులలో,  40 దేవాలయాలను సందర్శించడం ద్వారా  కర్నాటక  సీ.ఎం కుమారస్వామి రికార్డు సృష్టించారు. అంటే ఆయన ప్రతి 2 రోజులకు 1 ఆలయం సందర్శించారనమాట. ఈ ఏడాది మే 23 న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కుమారస్వామి 34 ఆలయాలను సందర్శించారని ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా అందిన సమాచారం ద్రువీ కరిస్తోంది.

కుకే సుబ్రమణ్య స్వామి , ధర్మస్తల సందర్శించడానికి ముందు అతను హద్రానంహల్లి వద్ద ఉన్న ఈశ్వర దేవాలయాన్ని సందర్శించాడు. అంతేకాక,  మాండ్య లోని ఆదిచ్చననేగిరి,  మైసూరులోని సుతుర్ మఠం, తుముకూరులోని  సిద్దగంగా మఠం వంటి ఆరుకు పైగా మఠాలను కూడా కుమారస్వామి దర్శించారు.  మరో మారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే తనకు అనుకూలించిన దేవుళ్లనందరినీ కుమారస్వామి దర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.  ఈ విషయంలో ఆయన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కూడా అధిగమించారు.

మాజీ ప్రధాన మంత్రి హెచ్డి దేవే గౌడ రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుండి దేవ్ గౌడ కుటుంబం ఆధ్యాత్మిక విషయాలను, మతపరమైన ఆచారాలపై గట్టిగా నమ్మకం కలిగి ఉందని  ఈ విషయంలో కుమారస్వామికి మిహాయింపు ఉండేది, కానీ గత కొద్ది సంవత్సరాలుగా  ఆరోగ్యం అసాధారణంగా మారడంతో,కుమారస్వామి కూడా ఇపుడు గుడులు, గోపురాలు ఎక్కువగా తిరుగుతున్నట్టు కుమారస్వామి కుటుంబానికి దగ్గరగా ఉన్న జెడిఎస్ నాయకుడు ఒకరు చెప్పారు.  ఏది ఏమైనా, మూడు నెలలు కూడా కాకుండా ఇన్ని గుడులు తిరుగుతూ ఉంటే పరిపాలన కుంటుపడదా, అని హేతువాదులు వారి దారిలో వారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

 

మామాట:  ఓటర్లను నమ్ముకోవడం కంటే దేవుళ్లను నమ్ముకోవడం బెటరనుకున్నారేమో

Leave a Reply