అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: సీఎం తనయుడు

Share Icons:

బెంగళూరు, 7 జూన్:

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చుననీ.. జేడీఎస్ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఎన్నికలు ఎప్పుడొస్తాయో మనకు తెలియదని, వచ్చే ఏడాది, వచ్చే రెండేళ్లు లేదా మరో మూడేళ్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలని నిఖిల్ పేర్కొన్నారు.

కాగా, కర్నాటక సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో కుమారస్వామి తనయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కర్నాటక జేడీఎస్ చీఫ్ ఏహెచ్ విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేసిన కొద్దిరోజులకే ఈ వీడియో బయటికి రావడం గమనార్హం. కాగా ప్రస్తుతం జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రమాదమేమీ లేదనీ.. తన తండ్రి పూర్తికాలం పాటు సీఎం పదవిలో ఉంటారని నిఖిల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply