“అక్టోబ‌ర్ 25న టీఆర్ఎస్ అధ్య‌క్ష ఎన్నిక” -కేటీఆర్

Share Icons:
  • అక్టోబ‌ర్ 17న ఎన్నిక‌ల షెడ్యూల్ , 22 వ‌ర‌కు నామినేష‌న్లు
  • 23న నామినేష‌న్ల ప‌రిశీల‌న. 24న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌
  • రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌గా ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి
  • తీర్మానాల క‌మిటీ చైర్మ‌న్‌గా సిరికొండ మ‌ధుసూద‌న‌చారి
  • వ‌రంగ‌ల్‌లో న‌వంబ‌ర్ 15న టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది “తెలంగాణ విజయ గర్జన” సభ

తెలంగాణ భ‌వ‌న్‌లో  మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు పార్టీ సంస్థాగ‌త నిర్మాణ ప్ర‌క్రియ క్షేత్ర‌స్థాయి నుంచి మొద‌లుకొని ప‌ట్ట‌ణ‌, మండ‌ల స్థాయి వ‌ర‌కు క‌మిటీల నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3600 పైచిలుకు వార్డు క‌మిటీల‌తో పాటు బ‌స్తీ క‌మిటీలు, డివిజ‌న్ క‌మిటీలు, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీలు పూర్తి చేశామ‌న్నారు. అనుబంధ సంఘాల నిర్మాణం కూడా పూర్త‌యింద‌ని  వెల్ల‌డించారు.

2019లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కార‌ణంగా, 2020, 2021లో క‌రోనా వ్యాప్తి కార‌ణంగా పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హించ‌లేదు. అక్టోబ‌ర్ 17న ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌. హైదరాబాద్  హెచ్ఐఐసీ ప్రాంగ‌ణంలో అక్టోబ‌ర్ 25న పార్టీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకుంటామ‌ని కేటీఆర్ తెలిపారు. ఆ స‌మావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ 14 వేల మంత్రి ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన‌నున్నారు. అధ్య‌క్ష‌ ఎన్నిక‌కు సంబంధించి అక్టోబ‌ర్ 17న షెడ్యూల్ విడుద‌ల కానుంది. 22వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 23న నామినేష‌న్ల ప‌రిశీల‌న ఉంటుంది. 24న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌ర‌తీది. 25న జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌లో పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకోనున్నారు. రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌గా ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 25న అధ్య‌క్ష ఎన్నిక ముగిసిన అనంత‌రం పార్టీ ప్లీన‌రీ.

వ‌రంగ‌ల్‌లో న‌వంబ‌ర్ 15న తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న.  అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో,  తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాల‌ని పిలుపునిచ్చారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

.

Leave a Reply