రేవంత్‌పై సెటైర్ వేసిన కేటీఆర్…

Share Icons:

హైదరాబాద్, 3 జనవరి:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యనే ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్ళిన రేవంత్…రెండేళ్ల పాటు మీడియా ముందుకు రానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే రేవంత్ నిర్ణయంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. బుధవారం సాయంత్రం సనత్ నగర్‌లో జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజలు గుద్దిన గుద్దుడుకు ప్రజాకూటమి నేతలు ఇప్పటికీ లేవలేదని లేచేపరిస్థితుల్లో లేరని అన్నారు.

అలా ప్రజలు గుద్దిన గుద్దుడుతో కొంతమంది ఇంకా లేవలేదన్నారు. రెండేళ్లు మీడియాకు దూరంగా ఉంటామంటూ రేవంత్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. రెండేళ్లు రాజకీయాల జోలికి రానంటూ బైబై చెప్పేసి టూర్లు తిరుగుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. మీడియాకు కూడా గుడ్ బై చెప్పేశారని విమర్శించారు. ఓటమికి గల కారణాలు ఏం చెప్పాలనో తెలియడం లేదన్నారు. 

మరికొంతమంది ఏం చెప్పాలో తెలియక ఆగమాగం అవుతున్నారన్నారు. కొందరైతే ఈవీఎం మిషన్లు సరిగ్గా లేవంటున్నారని గుర్తు చేశారు. 

మామాట: మరి తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఎవరిదో

Leave a Reply