ఉత్తమ్…నేను మీ పప్పులా కాదు….

KTR Satairs on uttam kumar reddy
Share Icons:

హైదరాబాద్, 8 సెప్టెంబర్:

మంత్రి కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడూ అంట్లు తోముకుంటూ, బాత్‌రూములు కడిగేవారు అంటూ  టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై ఉత్తమ్ వ్యాఖ్యలకు కేటీఆర్ ధీటుగా సమాధానమిచ్చారు. అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పుగా కూడా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.

డియర్ ఉత్తమ్ అని సంబోధిస్తూ అమెరికాలో తన ఇంట్లో తాను తన అంట్లు తోముకుని ఉంటానని, తమ సొంత ఇళ్లలో ప్రతి భారతీయుడి మాదిరిగానే తాను కూడా చేశానని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.

ఇక మీ పప్పు మాదిరిగా కాకుండా పనిచేసుకుని సొంతంగా సంపాదించుకుని గౌరవంగా జీవించినందుకు గర్విస్తున్నానని ఆయన చెప్పారు. మీ మాదిరిగా ప్రజల డబ్బును లూటీ చేసి కారులో డబ్బులను తగులబెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

మామాట: ముందస్తు మాటల యుద్ధం….

Leave a Reply